బంగారు, వెండి రాఖీలకు గిరాకీ... దుకాణాల వద్ద అన్నాచెల్లెళ్ల సందడి!

ABN , First Publish Date - 2021-08-22T15:30:28+05:30 IST

ఈరోజు దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు జరుగుతున్నాయి....

బంగారు, వెండి రాఖీలకు గిరాకీ... దుకాణాల వద్ద అన్నాచెల్లెళ్ల సందడి!

నాగపూర్: ఈరోజు దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ ఏడాది బంగారు, వెండి రాఖీలకు మరింత గిరాకీ పెరిగింది. మహారాష్ట్రలోని నాగపూర్‌లో బంగారు, వెండి రాఖీలతో పాటు జాతి రత్నాలతో రాఖీలను తయారు చేస్తుంటారు. ఈ రాఖీలను బ్రాస్‌లెట్‌ల మాదిరిగానూ రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆభరణాల దుకాణదారులు మాట్లాడుతూ ఈ ఏడాది రాఖీ సందర్భంగా బంగారు, వెండి రాఖీలకు గిరాకీ మరింతగా పెరిగిదని, ఆర్డర్లు విరివిగా వచ్చాయని తెలిపారు. 


ఇదేవిధంగా మంచి ముత్యాలతో తయారు చేసిన రాఖీలకు కూడా డిమాండ్ పెరిగిందన్నారు. రక్షాబంధన్ సందర్భంగా ఆభరణాల దుకాణాల వద్ద అన్నాచెల్లెళ్ల సందడి కనిపించింది. ఇదిలావుండగా గుజరాత్ ప్రభుత్వం ఈ రోజు వ్యాక్సినేషన్‌కు విరామం ఇస్తున్నట్లు ప్రకటించింది. మహిళా ఆరోగ్య కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.


Updated Date - 2021-08-22T15:30:28+05:30 IST