X Ray Machines కు కూడా చిక్కలేదు.. అయినా అనుమానంతో ఈ Beauty Creams ను కత్తిరించి చూస్తే..

ABN , First Publish Date - 2022-07-18T20:46:59+05:30 IST

కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా గోల్డ్ స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు.

X Ray Machines కు కూడా చిక్కలేదు.. అయినా అనుమానంతో ఈ Beauty Creams ను కత్తిరించి చూస్తే..

కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా గోల్డ్ స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. స్మగ్లర్లు వినూత్న పద్ధతుల ద్వారా బంగారాన్ని అక్రమంగా భారత్‌కు తరలిస్తున్నారు. జైపూర్ విమానాశ్రయంలో ఆదివారం మరో Gold smuggling కేసు బయటపడింది. ఒక వ్యక్తి మూవ్, ఫేస్ క్రీమ్ వంటి ట్యూబ్‌ల్లో ఏడు బంగారు కడ్డీలను తరలిస్తూ జైపూర్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు దొరికాడు. అతడి నుంచి 145.26 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ దాదాపు 7 లక్షల 50 వేల రూపాయలు.


ఇది కూడా చదవండి..

పన్నీర్ కర్రీ ఆర్డర్ చేస్తే చికెన్ కర్రీ పంపించారు.. రెస్టారెంట్‌కు రూ.20 వేలు జరిమానా..!


రాజస్థాన్‌లోని చురు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆదివారం ఉదయం ఇండిగో విమానంలో దోహా నుంచి ముంబై చేరుకున్నాడు. ముంబైలో ఎయిర్ ఇండియా విమానం ఎక్కి ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు జైపూర్ చేరుకున్నాడు. ఆ యువకుడి బ్యాగ్‌లో ఉన్న బంగారం స్కానర్లకు కూడా దొరకలేదని అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడకపోవడానికి అదే కారణం కావొచ్చని, అయితే తమకు అప్పటికే సమాచారం ఉండడం వల్ల ఎక్స్‌రే మిషన్‌తో బ్యాగ్‌ను మళ్లీ పరిశీలించగా అందులో కొన్ని నల్ల మచ్చలు కనిపించాయని చెప్పారు. 


బ్యాగ్‌లో ఉన్న చిన్న బకెట్‌లో చాక్లెట్లు, కాస్మెటిక్ వస్తువులు కనిపించాయని చెప్పారు. కాస్మెటిక్ ట్యూబ్‌లను తెరిచి చూడగా చిన్న చిన్న బంగారు కడ్డీలు బయటపడ్డాయని చెప్పారు. నిందిత యువకుడు దోహాలో కూలీగా పనిచేస్తున్నాడు. దోహా విమానాశ్రయంలో ఒక పరిచయస్తుడు అతనికి ఈ బకెట్ ఇచ్చాడు. అందులో ఉన్న కాస్మెటిక్ క్రీమ్ ట్యూబ్‌ల్లో బంగారు రాడ్లు ఉన్నట్టు తనకు తెలియదని ఆ యువకుడు చెప్పాడు.

Updated Date - 2022-07-18T20:46:59+05:30 IST