బంగారం భగ్గు

ABN , First Publish Date - 2020-02-25T10:50:18+05:30 IST

కరోనా వైరస్‌ ప్రభావంతో పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. సోమవారం ఢిల్లీ స్పాట్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.953 పెరిగి రూ.44,472కు చేరుకుంది. దేశీయంగా పసిడికిది సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి. కరోనా కల్లోలంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు కుదేలయ్యాయి. దాంతో ఇన్వెస్టర్లు తమ

బంగారం భగ్గు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ప్రభావంతో పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. సోమవారం ఢిల్లీ స్పాట్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.953 పెరిగి రూ.44,472కు చేరుకుంది. దేశీయంగా పసిడికిది సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి. కరోనా కల్లోలంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు కుదేలయ్యాయి. దాంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భద్రమైన పెట్టుబడి సాధనాలుగా పేరున్న బంగారం, వెండిలోకి మళ్లించారు. తత్ఫలితంగా, అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాలకు డిమాండ్‌ అనూహ్యంగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా దేశీయ మార్కెట్లోనూ ధరలు పుంజుకున్నాయి. రూపాయి విలువ క్షీణత కూడా మరో కారణం. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం 1,682 డాలర్లు పలుకుతోంది. పుత్తడితోపాటు వెండి ధరలు సైతం ఎగబకాయి. కిలో వెండి రూ.586 పెరిగి రూ.49,990కి చేరుకుంది. అంటే, రూ.50 వేల మైలురాయికి అతి సమీపంలో ఉందన్నమాట. ముంబై మార్కెట్లో తులం బంగారం ఏకంగా రూ.1,848 పెరిగి రూ.43,590గా నమోదైంది. కిలో వెండి రూ.1,430 పెరుగుదలతో రూ.49,035కి చేరుకుంది. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.43,130కి, కేజీ వెండి రూ.48,900 పలికింది.

Updated Date - 2020-02-25T10:50:18+05:30 IST