దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు..

ABN , First Publish Date - 2022-07-27T13:41:26+05:30 IST

మహిళలకు అత్యంత ఇష్టమైనది ఏదైనా ఉందంటే..బంగారం. దానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక దేశంలో బుధవారం బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. 10 గ్రాముల బంగారంపై...

దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు..

Gold Price : మహిళలకు అత్యంత ఇష్టమైనది ఏదైనా ఉందంటే..బంగారం. దానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక దేశంలో బుధవారం బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. 10 గ్రాముల బంగారంపై రూ.320 నుంచి రూ.380 వరకు తగ్గుముఖం పట్టింది. అంతేకాదు..కిలో వెండిపైన కూడా రూ.500 వరకు తగ్గింది. బుధవారం 27/7/2022 నాటికి 22 క్యారెట్ల (Carrots), గ్రాము ధర రూ. 4,658 ఉండగా, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.5,078 ఉంది. ఇక దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 వద్ద ఉంది. భారతదేశంలోని వివిధ మెట్రో నగరాల్లో(Metro Cities) బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి.


హైదరాబాద్‌(Hyderabad)లో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.50,780 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.46,580


విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,580 ఉంది. 


విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,580 ఉంది.


దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.46,580గా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.50,780గా ఉంది.


చెన్నై(Chennai)లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,280గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,580గా ఉంది. 


కోల్‌కతా(Kolkatha)లో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 50,780 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 46,580. 


మరోవైపు ముంబై(Mumbai)లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,580గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,780గా ఉంది.

Updated Date - 2022-07-27T13:41:26+05:30 IST