పసిడి అధరహో..!

ABN , First Publish Date - 2021-06-17T05:05:56+05:30 IST

పసిడి ధర మళ్లీ పెరిగింది.

పసిడి అధరహో..!

గ్రాము బంగారం రూ.5 వేలు పైమాటే

కేజీ వెండి రూ.74 వేలు


నరసాపురం, జూన్‌ 16 : పసిడి ధర మళ్లీ పెరిగింది. గ్రాము రూ.5 వేలు దాటింది. బుధవారం బులియన్‌ మార్కెట్‌ పది గ్రాములు బిస్కెట్‌ బంగారం రూ.50,200 పలకగా, గ్రాము రూ.5,020 చేరింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం గ్రాము 4,625కు చేరింది. ఇక వెండి కేజీ రూ.74,400 పలికింది. గత నెలలో గ్రాము బంగారం రూ.5 వేలకు దిగువన కొనసాగింది. చాలా కాలం రూ.4,700 నుంచి రూ.4,900 మధ్య కొనసాగింది. ఇటీవల అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరుగుదల, కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడం, స్టాక్‌ మార్కెట్ల పతనం పసిడి, వెండి ధరల పెరుగుదలకు కారణాలని బులి యన్‌ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా బులియన్‌ వ్యాపారం జరిగే నరసాపురం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు పట్టణాల్లో ఈ సీజన్‌లో రోజుకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లపైనే వ్యాపారం జరిగేది. నేడు లాక్‌డౌన్‌, ధర పెరుగుదల పసిడి మార్కెట్‌ డిమాండ్‌ను తగ్గించింది.

Updated Date - 2021-06-17T05:05:56+05:30 IST