బంగారు తెలంగాణకు పునరంకితం కావాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-01-27T05:17:00+05:30 IST

బంగారు తెలంగాణ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు.

బంగారు తెలంగాణకు పునరంకితం కావాలి: కలెక్టర్‌
ఏవో శ్రీదేవికి అవార్డు అందజేస్తున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

ఘనంగా గణతంత్ర దినోత్సవం ఫ ఎగిరిన మువ్వన్నెల జెండా

సూర్యాపేట(కలెక్టరేట్‌), జనవరి 26 : బంగారు తెలంగాణ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. పోలీస్‌ కార్యాలయంలోని పరేడ్‌ గ్రౌండ్‌లో మంగళవారం నిర్వహించిన 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్‌ ప్రసంగించారు. దేశ స్వాతంత్య్రం, తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారిని ఎన్నటికి మరువరాదన్నారు. అదేవిధంగా పట్టణంలోని వివిధ పార్టీలు, స్వచ్ఛంధ సంస్థలు, సేవా సంస్థలు గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాయి. వాసవీక్లబ్‌ ఆధ్వర్యంలో మహా వీర్‌ చక్ర కల్నల్‌ సంతో్‌షబాబుకు జ్ఞాపకార్థం 104 మీటర్ల భారీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మునిసిపాలిటీలో కమిషనర్‌ రామాంజులరెడ్డి, మార్కెట్‌లో చైర్‌పర్సన్‌ ఉప్పల లలితాదేవి జెండాను ఎగురవేశారు. చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ, నాయకులు నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌, దిక్లాత్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో అధ్యక్షుడు గండూరి కృపాకర్‌ జెండాను ఎగురవేశారు. సూర్యాపేట ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు.  హుజూర్‌నగర్‌లో జరిగిన వేడుకల్లో మునిసిపల్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఆర్డీవో వెంకారెడ్డి, చైర్‌పర్సన్‌ గెల్లి అర్చనరవి, వైస్‌చైర్మన్‌ జక్కుల నాగేశ్వరరావు, ఎంపీపీ గూడెపు శ్రీనివాసు పాల్గొన్నారు. మఠంపల్లిలో  ఎంపీడీవో మామిడి జానకిరాములు, తహసీల్దార్‌ కార్యాలయంలో నర్సయ్య, పోలీస్‌ స్టేషన్‌లో సీఐ రాఘవరావు జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ముడావత్‌ పార్వతికోండానాయక్‌, జడ్పీటీసీ బానోతుజగన్‌నాయక్‌ పాల్గొన్నారు. పెన్‌పహాడ్‌లో తహసీల్దార్‌ శేషగిరిరావు, ఎంపీడీవో వేణుమాధవ్‌, ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి జెండాలను ఆవిష్కరించారు. చిలుకూరులో ఎంపీపీ ప్రశాంతి కోటయ్య, జడ్పీటీసీ శిరిష నాగేంద్రబాబు, అధికారులు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు. చింతలపాలెంలో ఎంపీపీ కొత్తమది వెంకటరెడ్డి,  డీటీ సురయ్య, ఎంపీడీవో గ్యామా, ఎస్‌ఐ నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు. గరిడేపల్లిలో తహసీల్దార్‌ కార్తీక్‌, ఎంపీడీవో వనజలు జెండా ఎగురవేయగా, ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివా్‌సగౌడ్‌, జడ్పీటీసీ పోరెడ్డి శైలజ, ఎంపీటీసీ స్వప్న, సర్పంచ్‌లు పాల్గొన్నారు. మేళ్లచెర్వులో వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కొట్టె పద్మాసైదేశ్వరరావు, జడ్పీటీసీ శాగంరెడ్డి పద్మాగోవిందరెడ్డి, జడ్పీ కో ఆప్షన్‌ మెంబరు ఎస్‌కె ఇమ్రాన్‌, వైస్‌ ఎంపీపీ గాయం గోపిరెడ్డి  పాల్గొన్నారు. మైహోం ఇండస్ర్టీస్‌ లో జాయింట్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌శ్రీనివాసరావు జెండాను ఎగుర వేశారు. డీజీఎం పార్ధసారథి, సతీష్‌ పాల్గొన్నారు. పాలకవీడులో తహశీల్దార్‌ కృష్ణానాయక్‌, ఎంపీడీవో జానయ్య, ఎస్‌ఐ నరేష్‌, డెక్కన్‌ సిమెంట్‌ కర్మాగారంలో జీఎం నాగమళ్లేశ్వరరావు జాతీయజెండాలు ఎగురవేశారు. అర్వపల్లిలో తహసీల్దార్‌ హరిచంద్రప్రసాద్‌, ఎస్‌ఐ మహేష్‌, ఎంపీడీవో ప్రభాకర్‌, పీఏసీఎ్‌సలో సీవో రామస్వామి జెండాలను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మన్నె రేణుకలక్ష్మినర్సయ్యయాదవ్‌, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌, నవీన్‌  పాల్గొన్నారు. కోదాడలో క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ జెండా ఎగురవేయగా, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ శిరీషాలక్ష్మినారాయణ, వైస్‌చైర్మన్‌ పద్మామధుసూదన్‌, చందు నాగేశ్వరరావు, వక్కవంతుల నాగార్జున, సుధారాణి పుల్లారెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎంవీఐ సుభాష్‌, సీఐ శివరాంరెడ్డి, ఎంపీడీవో శ్రీదేవి, ఏడిఏ వాసు, తహసీల్దార్‌ పీజేశర్మలు జెండావిష్కరించారు. ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌తో పాటు ఎంపీపీ కవితారెడ్డి, జడ్పీటీసీ క్రిష్ణకుమారి, వైస్‌ఎంపీపీ మల్లెల రాణిబ్రహ్మయ్య పాల్గొన్నారు. తిరుమలగిరిలో తహసీల్దార్‌ సంతో్‌షకిరణ్‌, ఎస్‌ఐ డానియోల్‌, మునిసిపల్‌ కమిషనర్‌ దండు శ్రీనివాస్‌, మార్కెట్‌ చైర్మన్‌ మూల అశోక్‌రెడ్డి, ఎంపీడీవో ఉమే్‌షచారి, జాతీయ జెండా ఎగురవేసారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పోతరాజు రజని, వైస్‌ చైర్మన్‌ సంకెపల్లి రఘునందన్‌రెడ్డి, ఎంపీపీ నెమురుగొమ్ముల స్నేహలత, జడ్పీటీసీ దూపటి అంజలి పాల్గొన్నారు. అనంతగిరిలో తహసీల్దార్‌ వాజీద్‌అలీ, ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ ఉమా శ్రీనివా్‌సరెడ్డి ఎంపీడీవో శ్రీనివా్‌సరావులు జెండాను ఎగురవేశారు. మునగాలలో తహసీల్దార్‌ కరుణశ్రీ, ఎంపీపీ ఎలక బిందు నరేందర్‌రెడ్డి, సీఐ పి.ఆంజనేయులు, ఎస్‌ఐ సత్యనారాయణ గౌడ్‌, మోడల్‌ స్కూల్‌లో ప్రిన్సిపాల్‌ సాయీశ్వరీ, గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ చింతకాయల ఉపేందర్‌లు జాతీయ జెండాను ఎగురవేశారు. నూతన్‌కల్‌లో తహసీల్దార్‌ జమీరుద్దీన్‌, ఎంపీడీవో ఇందిర, ఎంఈవో రాముల్‌ నాయక్‌, సర్పంచ్‌ తీగల కరుణశ్రీ గిరిధర్‌రెడ్డి, మున్న మల్లయ్య, జానయ్యలు కార్యాలయాల్లో జాతీయపతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ భూరెడ్డి కళావతి సంజీవరెడ్డి ఉన్నారు. మద్దిరాలలో తహసీల్దార్‌ రాంప్రసాద్‌, ఎంపీడీవో సరోజ, ఏవో దివ్య, ఏపీఎం సైదులు జెండా ఎగరవేయగా ఎంపీపీ గుడ్ల ఉపేంద్రవెంకన్న, జడ్పీటీసీ కన్న సురాంబవీరన్న, నాయకులు ఎస్‌ఎ.రజాక్‌, మార్త కృష్ణమూర్తి, భూతం సాగర్‌ పాల్గొన్నారు. నేరేడుచర్లలో తహసీల్దార్‌ రాంరెడ్డి, ఎంపీడీవో మహేందర్‌రెడ్డి, ఎస్‌ఐ యాదవేంద్రరెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ గోపయ్యలు జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నేరేడుచర్ల మార్కెట్‌ కమిటీ కార్యదర్శి ఘని మద్యం మత్తులో జాతీయ జెండా ఆవిష్కరణకు నిరాకరించాడు. దీంతో ప్రజా ప్రతినిధులు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో జెండా ఆవిష్కరించారు. మోతెలో వివిధ కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ముప్పాని ఆశాశ్రీకాంత్‌రెడ్డి, జడ్పీటీసీ పందిళ్లపల్లి పుల్లారావు, వైస్‌ఎంపీపీ మైనంపాటి సునీతమల్లారెడ్డి, తహశీల్దార్‌ పి.యాదగిరి, ఎంపీడీవో కే.శంకర్‌రెడ్డి, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-27T05:17:00+05:30 IST