అలివేలు మంగకు రూ.6 లక్షల బంగారు హారం
ABN , First Publish Date - 2022-07-07T05:52:36+05:30 IST
అలివేలు మంగకు రూ.6 లక్షల బంగారు హారం
ద్వారకాతిరుమల, జూలై 6: శ్రీవారి దేవేరి అలివేలు మంగకు గుడివాడకు చెందిన వ్యాపారవేత్త కందుల వెంకటేశ్వరస్వామి, వెంకట సత్యవతి దంపతులు రూ.6 లక్షల విలువైన 107 గ్రాముల బంగారు హారాన్ని బహూకరించారు. లక్ష్మీ రూపులతో పొదిగిన బంగారుహారాన్ని స్వామి వద్ద ఉంచి పూజలు జరిపించారు. హారాన్ని అలివేలు మంగకు అలంకరించాలని ఆలయ ఏ ఈవోలు వాసు, కేఎల్ఎన్ రాజు, లక్ష్మణస్వామి, సూపరింటెండెంట్ రమణరా జుకు అందజేశారు. అమ్మ కన్స్ట్రక్షన్ అధినేత మాటూరి రంగనాథ్ పాల్గొన్నారు.