Advertisement
Advertisement
Abn logo
Advertisement

సైౖకాలజీ విభాగంలో బంగారు పతకం ఏర్పాటు

కడప(వైవీయూ), డిసెంబరు 2: వైవీయూనివర్శిటీలోని సైకాలజీ విభాగంలో వల్లూ రు సిద్దయ్య, గాజులమ్మ దంపతుల పేరుతో బంగారు పతకాన్ని ఏర్పాటు చేసినట్లు వీసీ సూర్యకళావతి తెలిపారు. సిద్దవటం మండ లం మలినేని పట్టణానికి చెందిన జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా కార్యనిర్వాహకులు డాక్టర్‌ వల్లూరు బ్రహ్మయ్య, తన సోదరుడు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వీరబ్రహ్మయ్య, గోవిందయ్య అభీష్టం మేరకు వారి తల్లిదండ్రుల పేరుతో బంగారు పతకాన్ని ఏర్పాటు చేశారు. అందుకు రూ.1.25 లక్షల చెక్కును వీసీ సూర్యకళావతికి అందజేశారు.


Advertisement
Advertisement