రూ. 47 వేల మార్క్‌ను దాటేసిన బంగారం ధర

ABN , First Publish Date - 2020-05-23T00:04:42+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా నాలుగో దశ లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో దేశీయ

రూ. 47 వేల మార్క్‌ను దాటేసిన బంగారం ధర

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా నాలుగో దశ లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో దేశీయ బంగారు ఫ్యూచర్స్ శుక్రవారం ఒక శాతానికిపైగా పెరిగింది. ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 742 రూపాయలు (1.60 శాతం) పెరిగి 10 గ్రాములకు 47,130 రూపాయలను తాకింది. అంతకుముందు సెషన్‌లో 10 గ్రాములకు రూ. 46,388 వద్ద ముగిసింది. సాయంత్రం 4:15 గంటలకు గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ (జూన్ 5న డెలివరీ) 10 గ్రాములకు రూ. 46,995 వద్ద ట్రేడ్ అయింది. ఇది మునుపటి ముగింపుతో పోలిస్తే  1.31 శాతం, లేదా 10 గ్రాములకు 607 రూపాయలు.


ముంబైకి చెందిన ఇండస్ట్రీ బాడీ ఇండియన్ బులియన్ జువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకారం బంగారు ఆభరణాల ప్రారంభ రేటు పది గ్రాములకు రూ. 46,996, వెండి కిలోకు 46,800 రూపాయలుగా ఉంది. దీనికి జీఎస్టీ మినహా. కాగా, ఎక్సైజ్ పన్ను, రాష్ట్ర పన్నులు, తయారీ చార్జీలను బట్టి దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరల్లో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది.  

Updated Date - 2020-05-23T00:04:42+05:30 IST