ఫ్యూచర్స్‌లో పసిడి ‘రికార్డు’ల హోరు

ABN , First Publish Date - 2020-07-09T06:09:33+05:30 IST

ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో పసిడి ధర రికార్డులు సృష్టిస్తోంది. మల్టీ కమోడిటీస్‌ ఎక్స్చేంజ్‌ (ఎంసీఎక్స్‌)లో ఆగస్టులో డెలివరీ ఇచ్చే 10 గ్రాముల మేలిమి (24 కేరట్లు) బంగారం కాంట్రాక్ట్‌ ధర బుధవారం ఒక దశలో రూ.49,045కు దూసుకుపోయింది...

ఫ్యూచర్స్‌లో పసిడి ‘రికార్డు’ల హోరు

ముంబై: ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో పసిడి ధర రికార్డులు సృష్టిస్తోంది. మల్టీ కమోడిటీస్‌ ఎక్స్చేంజ్‌ (ఎంసీఎక్స్‌)లో ఆగస్టులో డెలివరీ ఇచ్చే 10 గ్రాముల మేలిమి (24 కేరట్లు) బంగారం కాంట్రాక్ట్‌ ధర బుధవారం ఒక దశలో రూ.49,045కు దూసుకుపోయింది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి ధర ఇంత రికార్డు స్థాయికి పోవడం ఇదే మొదటిసారి. స్పాట్‌ మార్కెట్‌లోనూ పసిడి ధర చుక్కలంటుతోంది. ఢిల్లీలో రూ.723 పెరిగి 10 గ్రాముల ధర రూ.49,898కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోనూ బుధవారం పది గ్రాముల మేలిమి బంగారం రూ.50,990 వరకు పోయింది. 


Updated Date - 2020-07-09T06:09:33+05:30 IST