Abn logo
Feb 21 2020 @ 07:41AM

భూగర్భంలో అపార బంగారం నిల్వలు...తాజా సర్వేలో వెల్లడి

లక్నో (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో భూగర్భంలో అపారమైన బంగారం నిల్వలు ఉన్నాయని వెల్లడైంది. జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఉత్తరప్రదేశ్ భూగర్భ గనుల శాఖ అధికారులు జరిపిన సర్వేలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భూగర్భంలో బంగారం నిల్వలున్నాయని తేలింది. సన్‌భద్రా జిల్లాలోని సన్ పహాడిలోని భూగర్భంలో 2,700 మిలియన్లు, హార్ది పొలాల్లో 650 మిలియన్ టన్నుల బంగారం నిల్వలున్నాయని తమ సర్వేలో తేలిందని సన్‌భద్రా జిల్లా గనుల శాఖ అధికారి కేకే రాయ్ వెల్లడించారు. యూపీలో బంగారం నిల్వలున్న ప్రాంతాల్లో మైనింగ్ చేయాలని యూపీ సర్కారు నిర్ణయించింది. బంగారం గనుల మైనింగ్ కోసం ఏడుగురు సభ్యులతో బృందాన్ని ఏర్పాటు చేసి ఈ టెండర్ల ద్వారా బంగారం మైనింగ్ కు అనుమతులు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. 

Advertisement
Advertisement
Advertisement