పసిడి మళ్లీ కళకళ!

ABN , First Publish Date - 2021-01-16T07:03:20+05:30 IST

కరోనా సంక్షో భం, ధరల ఊగిసలాటల కారణంగా గత ఏడాది వెలవెలబోయిన పసిడికి ఈ ఏడాది డిమాండ్‌ మళ్లీ పుంజుకోనుందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ఆశాభావం వ్యక్తం చేసింది. వినియోగదారుల కొనుగోలు సెం టిమెంట్‌ క్రమంగా

పసిడి మళ్లీ కళకళ!

2021లో పెరగనున్న గిరాకీ: డబ్యూజీసీ 


ముంబై: కరోనా సంక్షో భం, ధరల ఊగిసలాటల కారణంగా గత ఏడాది వెలవెలబోయిన పసిడికి ఈ ఏడాది డిమాండ్‌ మళ్లీ పుంజుకోనుందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ఆశాభావం వ్యక్తం చేసింది. వినియోగదారుల కొనుగోలు సెం టిమెంట్‌ క్రమంగా మెరుగుపడుతుడటం ఇందుకు దోహదపడనుందని తాజా నివేదికలో పేర్కొంది. గత ఏడాది నవంబరులో ధనత్రయోదశి అమ్మకాలను బట్టి చూస్తే ఆభరణాలకు డిమాండ్‌ అంతంత మాత్రంగానే నమోదైనప్పటికీ.. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే గణనీయంగా పెరిగిందని డబ్ల్యూజీసీ అంటోంది.


కొవిడ్‌ టీకా పంపిణీతో మార్కెట్లో పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకోనున్నాయని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ పీఆర్‌ సోమసుందరం అన్నారు. కరోనా కారణంగా 2020లో వాయిదాపడిన పెళ్లి, పండగ కొనుగోళ్లతో ఈ ఏడాది ఆభరణాలకు గిరాకీ ఒక్కసారిగా పుంజుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. 2009 ఆర్థిక మాంద్యం తర్వాత కూడా వరుసగా మూడేళ్లపాటు పసిడికి అధిక డిమాండ్‌ కన్పించిందన్నారు. బంగారం వినియోగంలో చైనా తర్వాత అతిపెద్ద దేశం మనదే. కరోనా సంక్షోభం దెబ్బకు గత ఏడాది భారత్‌ పసిడి దిగుమతులు సగానికి పైగా తగ్గి 275.5 టన్నులకు పరిమితమయ్యాయి. 

Updated Date - 2021-01-16T07:03:20+05:30 IST