బంగారు గొలుసు చోరీ

ABN , First Publish Date - 2022-05-15T05:29:49+05:30 IST

బంగారు గొలుసు చోరీ

బంగారు గొలుసు చోరీ

మదనపల్లె క్రైం, మే 14: బస్సు ఎక్కుతుండగా గుర్తుతెలియని దుండగులు మహిళ బ్యాగులోని బంగారు గొలుసు చోరీ చేసిన సంఘటన శనివారం మదనపల్లెలో జరిగింది. బాధితురాలి కథనం మేరకు..కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన సత్య నారాయణస్వామి, లక్ష్మీదేవి దంపతులు నాలుగురోజుల కిందట మదనపల్లెలో వున్న బంధువుల ఇంటికి వచ్చారు. ఈనేపథ్యం లో శనివారం స్వగ్రామానికి వెళ్లేందుకు స్థానిక ఆర్టీసీబస్టాండు లో బస్సు ఎక్కేక్రమంలో గుర్తుతెలియని దుండగులు లక్ష్మీదేవి హ్యాండ్‌బ్యాగులో వున్న 100 గ్రాముల బంగారు గొలుసు చోరీ చేశారు. కాగా బస్సెక్కి బ్యాగు తెరిచి చూడగా, అందులో గొలు సు లేదు. దీంతో చోరీ జరిగిందని తెలుసుకున్న వారు ఘటనపై టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గొలుసు రూ.5 లక్షలు విలువ చేస్తుందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

ఇద్దరు ఆత్మహత్యాయత్నం


మదనపల్లె క్రైం, మే 14: వేర్వేరు కారణాలతో ఇద్దరు ఆత్మహత్య కు యత్నించారు. మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన రెడ్డిశేఖర్‌ భార్య శశికళ(21)శనివారం కుటుంబ సమస్య లపై భర్తతో గొడవపడి ఫినాయిల్‌ తాగి ఆత్మహత్యకు యత్నిం చింది. అలాగే తంబళ్లపల్లె మండలం కొటాలకు చెందిన రెడ్డె మ్మ(70)కుటుంబీకులు పట్టించుకుని సేవలు చేయలేదని మన స్తాపం చెంది పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిం ది. కుటుంబీకులు వారిని జిల్లా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.

ఆటో బోల్తా : ఏడుగురికి గాయాలు


తంబళ్లపల్లె, మే 14: ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు గాయపడిన సంఘటన తంబళ్లపల్లె మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు...శనివారం ఉదయం కొటాల నుంచి తంబళ్లపల్లెకు ప్రయాణికులతో వస్తున్న ఆటో పెద్దమండ్యం రోడ్డులో  అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తంబళ్లపల్లె సిద్దారెడ్డిగారిపల్లెకు చెందిన మాబూసాబ్‌(65), బండ్రేవు కొత్తపల్లెకు చెందిన ఈశ్వర్‌రెడ్డి(45)కి తీవ్ర గాయాలవ్వగా, లలితమ్మ, మస్తాన్‌బీ, సరోజమ్మ, జగన్‌, సరిత స్వల్పంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన తంబళ్లపల్లె సీహెచ్‌సీకీ తరలించి వైద్య చికిత్సలు అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన మాబూసాబ్‌, ఈశ్వర్‌రెడ్డిని మదనపల్లె జిల్లా వైద్యశాలకు తరలించారు. 

Updated Date - 2022-05-15T05:29:49+05:30 IST