ఆలయ నిర్వాహకుడికి బంగారు హారం అందజేస్తున్న వెంకట్రావు, రాజ్యలక్ష్మి
గన్నవరం, జనవరి 20: పాత గన్నవరంలోని శ్రీలక్ష్మీ తిరుపతమ్మకు భక్తులు నర్రా వెంకట్రావు, రాజ్యలక్ష్మి దంపతులు కానుకగా రూ.1.25 లక్షల విలువైన బంగారం హారాన్ని గురువారం ఆలయ నిర్వాహకుడు జాస్తి శ్రీధర్రావుకు అందజేశారు. దోనేపూడి శివ, జాస్తి ఫణిశేఖర్, జాస్తి అనంతలక్ష్మి పాల్గొన్నారు.