Abn logo
Sep 20 2021 @ 00:40AM

దైవదర్శనానికి వెళ్తూ.. అనంత లోకాలకు

చికిత్సపొందుతున్న క్షతగాత్రులు

రెండు కార్లు ఢీ.. ఒకరి మృతి ఫ ఏడుగురికి గాయాలు

బూర్జ, సెప్టెంబరు 19: మండలంలోని నీలంపేట జంక్షన్‌ వద్ద ఆదివారం రెండు కార్లు ఢీకొన్న సంఘటనలో విజయనగరం జిల్లాకు చెం దిన ఓ వ్యక్తి మృతి చెందాడు. కుటుంబ సభ్యు లతో కలిసి దైవదర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమా దం జరిగింది. పోలీసుల కథనం మేరకు... విజయ నగరం జిల్లా జియ్యమ్మవలస మండలం గెడ్డ సింగుపురానికి చెందిన బౌరోతు వెంకటనాయుడు (94)తో పాటు కుటుంబ సభ్యులు కారులో శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యనారా యణ స్వామి దర్శనానికి వెళ్తున్నారు. అదే విధంగా శ్రీకాకుళం రూరల్‌ మండలం రాగోలు, రాయపాడు గ్రామాలకు చెందిన కొన్ని కుటుంబాలు కారులో  దైవదర్శనం కోసం రాయగడకు వస్తున్నారు. అయితే, నీలంపేట జంక్షన్‌ వద్ద ఓ సైకిల్‌ను తప్పించబోయి రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో  వెంక టనాయుడు అక్కడికక్కడే మృతి చెందగా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రాయపాడుకు చెందిన సీర భాస్కరరావు, విశ్వేశ్వరరావు, కారు డ్రైవర్‌ సంతోష్‌కుమార్‌, అప్పలరాజు,  గెడ్డసింగుపురానికి చెందిన పాలవలస అచ్చెమ్మ, బౌరోతు విజయలక్ష్మి, ముద్దాడ అప్పలరాజులు గాయపడ్డారు. వీరిని  పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బూర్జ ఎస్‌ఐ వెంకట సురేష్‌ ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదుచేశారు. వెంకటనాయుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు.