రైళ్లల్లో ప్రయాణం చేస్తున్నారా..? ఇలాంటి మాటల్ని ఎవరైనా చెబితే అస్సలు నమ్మొద్దు..!

ABN , First Publish Date - 2021-08-04T01:34:09+05:30 IST

అతను స్వగ్రామం వెళ్లడం కోసం రైల్వే స్టేషన్ వచ్చాడు. టికెట్ తీసుకొని రైలు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు అతని వద్దకు వచ్చారు.

రైళ్లల్లో ప్రయాణం చేస్తున్నారా..? ఇలాంటి మాటల్ని ఎవరైనా చెబితే అస్సలు నమ్మొద్దు..!

ఇంటర్నెట్ డెస్క్: అతను స్వగ్రామం వెళ్లడం కోసం రైల్వే స్టేషన్ వచ్చాడు. టికెట్ తీసుకొని రైలు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు అతని వద్దకు వచ్చారు. తాము రైల్వే అధికారులమని చెప్పారు. ఏవో ఐడీలు చూపించారు. ఇటీవలి కాలంలో రైల్వే శాఖలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాల చిట్టి చెప్పారు. ఈ నిబంధనల ప్రకారం రైల్లో ప్రయాణించే వాళ్లు తమ వద్ద రూ.2వేల కన్నా ఎక్కువ డబ్బు ఉంచుకోకూడదని చెప్పారు. తొలుత ఆ మాటలు నమ్మని సదరు ప్రయాణికుడు ఆ తర్వాత ఇద్దరు అధికారులు చెప్పిన వివరాలు విన్నాక నమ్మాడు. తన వద్ద 2వేల రూపాయల కన్నా ఎక్కువ ఉన్న డబ్బును వారికిచ్చాడు.


ఆ సొమ్ము తీసుకొన్న అధికారులిద్దరూ.. ప్రయాణికుడు మొబైల్‌కు ఓటీపీ వస్తుందని, దాన్ని తీసుకొని కౌంటర్ వద్ద చూపిస్తే తమకు ఇచ్చిన సొమ్ము ఇచ్చేస్తారని చెప్పారు. నిజమే అనుకున్న ప్రయాణికుడికి ఎంత సేపటికీ ఓటీపీ రాలేదు. టికెట్ కౌంటర్‌లో అడిగితే అసలు అలాంటి నిబంధనలేవీ లేవన్నారు. అప్పుడు తెలిసింది తాను ఘోరంగా మోసపోయానని. ఇలాంటి ఘటనలు తాజాగా పలు చోట్ల రైల్వే స్టేషన్లలో జరుగుతున్నాయి. ఇలా రాజస్థాన్‌లోని కాలూపూర్ రైల్వేస్టేషన్లో ప్రయాణికులను మోసం చేస్తున్న ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి మూడు మొబైల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం ఇలాంటి నిబంధనలు ఏవీ తీసుకురాలేదని, ఇలాంటి మోసగాళ్ల మాటలు నమ్మొద్దని రైల్వే పోలీసులు ప్రయాణికులను హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2021-08-04T01:34:09+05:30 IST