పారిశుధ్య దేవుళ్లు

ABN , First Publish Date - 2020-04-10T10:51:33+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు మునిసిపల్‌ అధికారులు, సిబ్బంది నడుం బిగించారు. తమ ప్రాణాలు కాపాడుకుంటూనే పట్టణ ప్రజల ప్రాణాలను కూడా కాపాడేందుకు

పారిశుధ్య దేవుళ్లు

తమ ప్రాణాలు కాపాడుకుంటూనే నిత్యం సమరం


రామగిరి, ఏప్రిల్‌  9: కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు మునిసిపల్‌ అధికారులు, సిబ్బంది నడుం బిగించారు. తమ ప్రాణాలు కాపాడుకుంటూనే పట్టణ ప్రజల ప్రాణాలను కూడా కాపాడేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఎన్జీ కళాశాల, క్లాక్‌టవర్‌ సెంటర్‌లో డిస్‌ ఇన్‌ఫెక్షన్‌ టన్నెల్‌ను రెండు రోజుల క్రితం ఏర్పాటు చేశారు. తాజాగా మరో టన్నెల్‌ను క్లాక్‌టవర్‌ సెంటర్‌లో ఏర్పాటుచేశారు. ఈ టన్నెల్‌ నుంచి ద్విచక్రవాహనదారుడు వెళ్లేలా ఏర్పాటుచేశారు. ఈ టన్నెల్‌లో పొగమంచు వలె హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ అవుతుంది. ఒక టన్నెల్‌కు రూ.55వేల ఖర్చు చొప్పున సుమారు రూ.లక్ష పైచిలుకు ఖర్చు చేసి ఈ రెండు టన్నెళ్లను ఏర్పాటుచేశారు. వీటి నిర్వహణకు ప్రతిరోజు రూ.3వేలు ఖర్చు కానుంది.


ఈటన్నెల్‌లో హైపోక్లోరైడ్‌ ద్రావణం పొగమంచు రూపంలో వస్తున్నందున ఇందులోంచి వెళ్లే వారి ఒంటిపై ఉండే వైరస్‌ కొంత వరకు అరికట్టబ డుతుంది. పట్టణంలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మీర్‌బాగ్‌ కాలనీ, రెహమత్‌నగర్‌, మాన్యంచెల్క, బర్కత్‌పురవంటి ప్రాంతాల్లో రెడ్‌జోన్లుగా మునిసిపల్‌ అధికారులు ప్రకటించారు. ఈ ప్రాంత ప్రజలు బయటకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి చర్యలు తీసుకున్నారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ కాలనీలో ప్రతిరోజు బ్లీచింగ్‌ చల్లిస్తున్నారు. తాజాగా గురువారం డ్రోన్ల ద్వారా హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. 


రహదారులపై అవగాహన చిత్రాలు

ప్రజలకు కరోనాపై అవగాహన కలిగించేందుకు పట్టణంలోని క్లాక్‌టవర్‌ సెంటర్‌లో కరోనాపై చిత్రాలు వేయించి అవగాహన కల్పిస్తున్నారు. ‘ముందు జాగ్రత్తలు పాటిద్దాం-కరోనా వైర్‌సను అరికడదాం’ అనే నినాదంతో చిత్రాలు వేయిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఏ ఒక్కరూ బయటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు.  

Updated Date - 2020-04-10T10:51:33+05:30 IST