Abn logo
Oct 28 2020 @ 19:14PM

ఆయిల్‌ పామ్‌ మొక్కలను విడుదల చేసిన గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌

ఏలూరు: అత్యధిక దిగుబడులను అందించే ఆయిల్‌ పామ్‌ మొక్కలను గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ విడుదల చేసింది. మలేషియా నుంచి సేకరించిన సేమీ క్లోనల్‌ విత్తనాల ద్వారా వీటిని అభివృద్ధి చేశారు. ఈ మొక్కలను ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ ఫ్యాక్టరీ జోన్‌ కింద ఉన్న రైతులకు పంపిణీ చేశారు. అక్టోబర్‌ –నవంబర్‌ 2020లో ఏపీలో 160 నుంచి 170 హెక్టార్లలో సాగును చేయగలమని ఆశిస్తున్నామని ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌, గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ సీఈవో నసీమ్‌ అలీ చెప్పారు.


‘‘ఆయిల్‌ పామ్‌లో అత్యధిక దిగుబడి అందించే సెమీ క్లోనల్‌ విత్తన మొక్కలను విడుదల చేసిన గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ను అభినందిస్తున్నామని అధికారి చిరంజీవ్‌ చౌదరి చెప్పారు. అత్యధిక దిగుబడి అందించే ఆయిల్‌ పామ్‌ మొక్కలు దేశవ్యాప్తంగా ఆయిల్‌ పామ్‌ రైతులు, పెంపకందారులకు లభ్యమవుతాయ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, ఒడిషా, గుజరాత్‌, మిజోరం, గోవాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు.


Advertisement