Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 18 Aug 2022 12:14:39 IST

Godfather : టీజర్ వచ్చేస్తోంది !

twitter-iconwatsapp-iconfb-icon

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా, తమిళ దర్శకుడు మోహన్ రాజా (Mohan raja) తెరకెక్కి్స్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గాడ్‌ఫాదర్’ (Godfather). మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ (Lucifer) చిత్రానికిది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. నయనతార (Nayanathara), సత్యదేవ్ (Satyadev) కీలక పాత్రలు పోషిస్తుండగా.. మలయాళ నటుడు బిజు మీనన్ (Biju Menon) విలన్‌గా నటించబోతున్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannath) మరో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. చిరంజీవి అనుచరుడుగా సునీల్ (Sunil) నటిస్తున్నారు.  ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) .. చిరుకి కుడిభుజం లాంటి పాత్ర చేస్తున్నారు. ఈ ఇద్దరిపై ఓ ప్రత్యేకమైన పాటను కూడా చిత్రీకరించారు. తమన్ (Thaman) అందించిన మాసీ ట్యూన్ చిత్రానికే హైలైట్‌గా నిలుస్తుందట. 

ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ క్రమంలో చిత్రం టీజర్‌ను కూడా వదులుతున్నారు. చిరు పుట్టినరోజు సందర్బంగా ఒక రోజు ముందే అనే ఈ నెల 21న ‘గాడ్‌ఫాదర్’ టీజర్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్ లో గెడ్డంతో ఉన్న చిరు అగ్రెసివ్ లుక్ ఆకట్టుకుంటోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఆచార్య’ (Acharya) తర్వాత చిరు నటించిన సినిమా ఇదే అవుతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఒరిజినల్ వెర్షన్‌‌ను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్వల్ప మార్పులు చేర్పులు చేశారు. అలాగే చిరంజీవి మేకోవర్ లోనూ మార్పు కనిపిస్తుంది. లక్ష్మీ భూపాల (Lakshmi Bhupala) అందించిన డైలాగ్స్ చిత్రానికే హైలైట్స్ కాబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. మరి ‘గాడ్‌ఫాదర్’ గా చిరంజీవి ఏ స్థాయి హిట్ అందుకుంటారో చూడాలి. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement