Oct 13 2021 @ 11:03AM

'గాడ్ ఫాదర్': సల్మాన్‌తో సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్న మేకర్స్..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం 'ఆచార్య'. ఈ సినిమా షూట్ కంప్లీట్ చేసుకొని రిలీజ్‌కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ రెండు భారీ రీమేక్ చిత్రాలు చేస్తున్నారు. వాటిలో మళయాళ బ్లాక్ బస్టర్ మూవీ 'లూసిఫెర్' రీమేక్ 'గాడ్ ఫాదర్' ఒకటి. ఈ సినిమాని తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ జెట్ స్పీడ్‌లో చిత్రీకరణ సాగుతోంది. 

ఇక ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మేకర్స్ నుంచి పక్కా కన్‌ఫర్మేషన్ లేనప్పటికి సల్మాన్ నటించేది మాత్రం నిజమే అంటున్నారు. తాజాగా దీనికి సంబంధించిన మరో లేటెస్ట్ న్యూస్ కూడా వచ్చింది. ఈ చిత్రంలో సల్మాన్ పాత్ర చిన్నదని అనుకున్నారు. కానీ కాస్త నిడివి ఎక్కువ ఉన్న పాత్రనే ఆయన చేస్తున్నారట. అంతేకాదు ఆయనపై ఓ సాంగ్ కూడా ఉందబోతోందని సమాచారం. ఇదే నిజమైతే 'గాడ్ ఫాదర్' మూవీపై పాన్ ఇండియన్ స్థాయిలో భారీ అంచనాలు నెలకొనడం ఖాయం.