భక్తులను కరుణించిన పార్వతీ అమ్మవారు

ABN , First Publish Date - 2022-09-28T04:47:59+05:30 IST

జిల్లా వ్యాప్తంగా శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో రెండో రోజు అమ్మవారు బిల్వవృక్ష నివాసిని పార్వతీదేవి గా భక్తులను కరుణించారు.

భక్తులను కరుణించిన పార్వతీ అమ్మవారు
వెంకటరాజంపేటలో మీనాక్షి దేవి అలంకారం

భక్తులను కరుణించిన పార్వతీ అమ్మవారు
రాజంపేట టౌన్‌/రైల్వేకోడూరు/ఒంటిమిట్ట/చిట్వేలి/
రాయచోటిటౌన్‌/సంబేపల్లె/చిన్నమండెం/లక్కిరెడ్డిపల్లె

జిల్లా వ్యాప్తంగా శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో రెండో రోజు అమ్మవారు బిల్వవృక్ష నివాసిని పార్వతీదేవి గా భక్తులను కరుణించారు. దశరా ఉత్సవాల సందర్భంగా పోలీసు లు ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రైల్వేకోడూరు కన్యకాపరమేశ్వరిదేవి ఆలయంలో జగన్మోహిని అలంకారం నిర్వహించారు. ఒంటిమిట్టలో వాసవీ మాత రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.  
 బిల్వవృక్ష నివాసినిగా శ్రీ వాసవీ మాత చిట్వేలిలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని బిల్వవృక్ష నివాసినిగా అలంక రించారు. రాయచోటిలో భద్రకాళీ సమేత వీరభద్రాలయం, ఎస్‌ఎన్‌కాలనీలోని ఉమామహేశ్వరి, మాండవ్యనది ఒడ్డున వెలిసిన తోపు గంగమ్మ, కొత్తపేట రామాపురంలోని చౌడేశ్వరిదేవి ఆలయాల్లో అమ్మవారు పార్వతీదేవి అలంకారంలో దర్శనం ఇచ్చారు. పాత రాయచోటిలోని శివాలయంలో అన్నపూర్ణేశ్వరి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కొత్తపేట, ఠాగూర్‌వీధి సమీపంలో అమ్మవార్లను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేపట్టి భక్తులకు అందజేశారు. సంబేపల్లెలో వెలిసిన నల్లగంగమ్మ తల్లి ఆలయంలో బాలాత్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చా రు.

అభయహస్త ముద్రతో ఉండే అమ్మవారి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు. సమస్తదేవి మం త్రాల్లో బాలా మంత్రం ఎంతో గొప్పది. దసరా మహోత్సవాల్లో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీబాలాదేవి, దేవపట్ల మాజీ సర్పంచ్‌ వెంకట్రామిరెడ్డి దంపతులు హోమం నిర్వహించారు. ఆలయ నిర్మాణ కర్త, ధర్మకర్తల మండలి చైర్మెన్‌ మునగా మురళీస్వామి, సర్పంచ్‌ అంచెల రామచంద్ర, ఈఓ కొండారెడ్డి, మాజీ సర్పంచ్‌ ప్రభాకర్‌నాయుడు, ఫిజికల్‌ డైరెక్టర్లు అమర్‌నాధరెడ్డి, నరసరాజు, వీరశంకర్‌, హరినాధ తదితరులు పాల్గొన్నారు. చిన్నమండెం మండలంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో రెం డో రోజు అమ్మవారు భవానీ రూపంలో భక్తుల కు దర్శనమిచ్చారు. మాండవ్య నది ఒడ్డున మల్లూరమ్మ ఆలయం లో అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా అలంకరించారు. దేవగుడిపల్లెలోని కాళీమాత ఆలయంలో అన్నదానాలు నిర్వహించారు. లక్కిరెడ్డిపల్లెలోని సర్వమంగళాదేవి, రామలింగేశ్వరస్వామి ఆలయంలో సర్వమంగళాదేవి అమ్మవారు శారదాంబ రూపంలో భక్తులకు దర్శనమిచ్చా రు. హరినాధస్వామి, ఆలయ ధర్మకర్త మోహన్‌రెడ్డి, ఆల య చైర్మెన్‌ రఘునాధరాజు, కార్యనిర్వాహణ కార్యదర్శి సూర్యుడునాయక్‌, సర్పంచ్‌ భూదేవమ్మ భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని భక్తులు దర్శించుకుని ఘనంగా పూజలు నిర్వహించారు.

Updated Date - 2022-09-28T04:47:59+05:30 IST