అశ్వవాహనంపై అమ్మవారి దివ్యతేజం

ABN , First Publish Date - 2022-05-23T06:24:09+05:30 IST

కుప్పంలో కొలువై ఉన్న ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారంనాడు ముత్తుమారెమ్మకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి విశేష అలంకరణలు చేశారు.సాయంత్రం ముత్తుమారెమ్మ ఉత్సవవిగ్రహాన్ని పూలమాలలతో, సర్వాభరణాలతో అలంకరించారు. ఆపైన అశ్వవాహనంపై అధిష్ఠింపజేశారు.

అశ్వవాహనంపై అమ్మవారి దివ్యతేజం

కుప్పం, మే 22: కుప్పంలో కొలువై ఉన్న ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారంనాడు ముత్తుమారెమ్మకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి విశేష అలంకరణలు చేశారు. అమ్మవారిని పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు. సాయంత్రం ముత్తుమారెమ్మ ఉత్సవవిగ్రహాన్ని పూలమాలలతో, సర్వాభరణాలతో అలంకరించారు. ఆపైన అశ్వవాహనంపై అధిష్ఠింపజేశారు. మేళతాళాలు, అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారు పట్టణంలో చిద్విలాసరూపులై ఊరేగారు. దివ్య తేజంతో విరాజిల్లే ముత్తమారెమ్మను భక్తజనం దర్శించి తరించారు. కర్పూర హారతులు ఇచ్చి, కొబ్బరికాయలు కొట్టి సేవించుకున్నారు. గంగమ్మ తల్లి కృపకు పాత్రులయ్యారు.


Updated Date - 2022-05-23T06:24:09+05:30 IST