మంచం పట్టిన గోదావరిఖని

ABN , First Publish Date - 2022-01-18T05:52:36+05:30 IST

గత 15రోజులుగా వాతావరణం లో తీవ్ర మార్పులు రావడం, చలి తీవ్రత పెరగడం, భారీవర్షం, ఈదురు గాలుల ప్రభావంతో కొత్త రోగాలు మొదలయ్యా యి.

మంచం పట్టిన గోదావరిఖని
ఓపీ రిజిస్ర్టేషన్‌ వద్ద భారీగా ఉన్న రోగులు

- చలిజ్వరం, గొంతునొప్పి, దగ్గు, జలుబుతో బాధపడుతున్న ప్రజలు 

- కిటకిటలాడుతున్న ఆసుపత్రులు 

కళ్యాణ్‌నగర్‌, జనవరి 17: గత 15రోజులుగా వాతావరణం లో తీవ్ర మార్పులు రావడం, చలి తీవ్రత పెరగడం, భారీవర్షం, ఈదురు గాలుల ప్రభావంతో కొత్త రోగాలు మొదలయ్యా యి. దీంతో గోదావరిఖని పట్టణం మంచి పట్టింది. ఏ ఆసుపత్రి చూసినా జ్వర పీడితులతో కిటకిటలాడుతుండగా ఇంటికి ఇద్దరు నుంచి ముగ్గురు జ్వరం, దగ్గు, గొంతునొప్పి, జలుబుతో బాధపడుతున్నారు. శుక్రవారం వ డగండ్ల వానతోపాటు ఈదురుగాలులతో వాతావరణంలో పలు మార్పులు సంభవించాయి. ఉదయం కూడా చలి ప్రభావం ఎక్కువగా ఉండడం, మబ్బులు కమ్మి ఉండడంతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రితో పాటు పట్టణంలోని పలు ప్రైవేట్‌ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. మరో పక్క చిన్న పిల్లలకు కూడా విష జ్వరాలు సోకుతున్నాయి. వైరస్‌ తీవ్రంగా ఉండడంతో ఒకరి నుంచి మరొకరికి తొందరగా సొకుతోంది. ఒక పక్క కరోనా మరో వైపు గత నాలుగు రోజులుగా గోదావరిఖనిలో విష జ్వరాలు విజృంభిస్తునాయి.. కరోనా ప్రభావం కూడా రోజురోజుకు పెరుగుతోంది. కేసుల సంఖ్య 70 నుంచి 100కు పెరగడం పారిశ్రామిక ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. కరోనా టీకా రెండవ డోస్‌ వేసుకున్న వారికి కూడా కరోనా సోకు తోంది. గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో పని చేస్తున్న ఐదుగురి సిబ్బంది కరోనా బారిన పడడం కలవరపెడుతున్నది. జిల్లాలోనే అత్యధికంగా విష జ్వరాలతో పాటు పాటు కరోనాతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Updated Date - 2022-01-18T05:52:36+05:30 IST