అపార జలనిధి ఉపయోగం ఏది?

ABN , First Publish Date - 2022-08-09T07:02:21+05:30 IST

ధవళేశ్వరం, ఆగస్టు 8: గోదావరి వరద పోటుతో ఉరకలెత్తినప్పుడల్లా ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ నుంచి వందల టీఎంసీలు సముద్రంలోకి కలిసిపోతాయి. అదే గోదావరి ఉరకలెత్తుతూ ప్రమాద హెచ్చరికల స్థాయిలో రోజులపాటు ప్రవహిస్తే వేల టీఎంసీలు సముద్రం పాలు అవుతాయి. గోదావరికి వేల టీఎంసీల నీరు వచ్చినా బ్యారేజీలో మాత్రం నిల్వ ఉంచగలిగేది కేవలం 3 టీఎంసీలు మాత్రమే. ఆపై వచ్చే నీరు గేట్ల నుంచి దిగువకు

అపార జలనిధి ఉపయోగం ఏది?

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి నిల్వ కేవలం 3 టీఎంసీలే

ప్రస్తుత సీజన్‌లో 2,638 టీఎంసీలు నీరు సముద్రంలోకి

మిగిలిన వేలాది టీఎంసీల గోదావరి నీరు వృథానే

జూలైలో అత్యధికంగా ఒకేరోజు 25 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

ఒక టీఎంసీ నీటితో 10 వేల ఎకరాలు సాగులోకి

కోట్ల ఎకరాలకు సరిపోయేంత నీరు కడలి పాలు


ధవళేశ్వరం, ఆగస్టు 8: గోదావరి వరద పోటుతో ఉరకలెత్తినప్పుడల్లా ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ నుంచి వందల టీఎంసీలు సముద్రంలోకి కలిసిపోతాయి. అదే గోదావరి ఉరకలెత్తుతూ ప్రమాద హెచ్చరికల స్థాయిలో రోజులపాటు ప్రవహిస్తే వేల టీఎంసీలు సముద్రం పాలు అవుతాయి. గోదావరికి వేల టీఎంసీల నీరు వచ్చినా బ్యారేజీలో మాత్రం నిల్వ ఉంచగలిగేది కేవలం 3 టీఎంసీలు మాత్రమే. ఆపై వచ్చే నీరు గేట్ల నుంచి దిగువకు సముద్రంలోకి ప్రవహించాల్సిందే. జూన్‌లో గోదావరికి కేవలం 1.5 టీఎంసీల నీరు వచ్చి చేరింది. జూలైలో సంభవించిన వరదలకు 2200 టీఎంసీలకుపైగా నీరు కాటన్‌ బ్యారేజీ ద్వారా సముద్రంలోకి ప్రవహించింది. వాస్తవానికి ఒక్క టీఎంసీ నీటితో 10 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. వేల టీఎంసీలతో కొన్ని కోట్ల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుం ది. కానీ నిల్వ సామర్థ్యం లేకపోవడం వల్ల ఆ నీరంతా సముద్రంలోకి వెళ్లి కలిసిపోతుంది. గోదావరి పరీవాహకంలో ఉన్న డెల్టాల పరిధిలో ని సాగుభూములకు, తాగునీటికి కలిసి ఒక్కో సీజన్‌కు 95 టీఎంసీల నుంచి 98 టీఎంల వరకు మాత్రమే వినియోగిస్తున్నారు. ఇక ధవళేశ్వ రం వద్ద జూలై 11న అర్ధరాత్రి నీటిమట్టం 11.75 అడుగులకు చేరి 10 లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవహిస్తుండగా మొదటి ప్రమాద హెచ్చ రికను జారీచేశారు. 13 రోజులపాటు హెచ్చరిక కొనసాగి జూలై 24న ఉపసంహరించారు. 12న జారీచేసిన రెండో ప్రమాద హెచ్చరిక 10 రోజులపాటు కొనసాగగా, 22వ తేదీ తెల్లవారుజామున ఈ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. 15న మూడో ప్రమాద హెచ్చరిక జారీచేయగా నాలుగు రోజులపాటు కొనసాగింది. 19వ తేదీన ఈ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ఈ వరదల సమయంలో అత్యధికంగా ఒకేరోజున 25.60 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కాటన్‌ బ్యారేజీ నుంచి దిగువకు ప్రవహించింది. ఆపై గోదావరి క్రమంగా తగ్గుముఖం పట్టినా 5 లక్షల క్యూసెక్కులకు పైబడిన ప్రవాహం చాలారోజుల వరకు కొనసాగింది. వరదల సీజన్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకు కాటన్‌ బ్యారేజీ నుంచి 2,638.309 టీఎంసీల నీరు వృఽథా గా సముద్రంలోకి కలిసిపోయింది. ఒకవేళ పోలవరం ప్రాజెక్టు పూర్త యి ఉంటే జూలైలో వచ్చిన వరదలకు ఒక్క రోజులోనే ప్రాజెక్టు నిండి పోయేది. ఇక మిగిలిన జలాలు ఎలాగూ సముద్రంలో కలవాల్సిందే.


మళ్లీ పెరుగుతున్న గోదావరి 

ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద గోదావరి ప్రవాహం మళ్లీ క్రమం గా పెరుగుతోంది. పరీవాహకంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువన ఉపనది ఇంద్రావతి నుంచి వరదనీరు వచ్చి చేరుతుం డడంతో ఉధృతి పెరిగింది. ఎగువన భద్రాచలం వద్ద ఆదివారం రాత్రి కి నీటిమట్టం 27 అడుగులు ఉండగా సోమవారం నాటికి 9 అడుగుల మేర పెరిగి 36 అడుగులకు చేరుకుని నిలకడగా కొనసాగుతోంది. ఎగువ నుంచి వరదనీరు వచ్చి చేరుతుండడంతో ధవళేశ్వరం వద్ద కాటన్‌ బ్యారేజ్‌ మొత్తం గేట్లను 1.5 మీటర్ల మేర పైకి ఎత్తి 4.46 లక్షల క్యూసెక్కుల దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఆదివారం పది అడుగులుగా ఉన్న నీటిమట్టం సోమవారం నాటికి 7.60 అడుగు లకు తగ్గింది. డెల్టా పరిధిలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణం గా డెల్టా కాలువకు సాగునీటి విడుదల నిలిపివేశారు.

Updated Date - 2022-08-09T07:02:21+05:30 IST