లంకలు బేజారు...

ABN , First Publish Date - 2022-07-13T07:13:41+05:30 IST

గోదావరి వరద పోటెత్తుతుండడంతో కోనసీమలోని నదీ పరీవాహక గ్రామాలు జలదిగ్భందానికి గురవుతున్నాయి. భారీ ఈదురుగాలులు, వర్షంతో పల్లపు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. డ్రెయిన్లన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలడం వల్ల నదీ పాయలన్నీ ఉధృతంగా ప్రవహిస్తూ సమీప గ్రామాలను ముం చెత్తుతున్నాయి. పలు కాజ్‌వేలు నీట మునగడంతో రవాణా వ్యవస్థ స్తం భించి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.

లంకలు బేజారు...
పి.గన్నవరం మండలం ఊడిమూడి ఏటిగట్టు దిగువున వరదనీటిలో మునిగిన సంచారజాతుల వారి నివాసాలు

  • పోటెత్తిన గోదావరి
  • జల దిగ్బంధంలో లంక గ్రామాలు
  • పలు కాజ్‌వేలు మునక.. స్తంభించిన రవాణా
  • కోటిపల్లి, నర్సాపురం రేవుల్లో రాకపోకలు నిలిపివేత
  • పౌర్ణమి పోటుతో మరింత అలజడి
  • వరద సహాయ కార్యక్రమాలకు రూ.2 కోట్లు విడుదల
  • కోనసీమ వరద పరిస్థితిపై సీఎం జగన్‌కు నివేదిక

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

గోదావరి వరద పోటెత్తుతుండడంతో కోనసీమలోని నదీ పరీవాహక గ్రామాలు జలదిగ్భందానికి గురవుతున్నాయి. భారీ ఈదురుగాలులు, వర్షంతో పల్లపు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. డ్రెయిన్లన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలడం వల్ల నదీ పాయలన్నీ ఉధృతంగా ప్రవహిస్తూ సమీప గ్రామాలను ముం చెత్తుతున్నాయి. పలు కాజ్‌వేలు నీట మునగడంతో రవాణా వ్యవస్థ స్తం భించి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వరద మరింత ప్రమాదకర పరిస్థితికి చేరే అవకాశం ఉండొచ్చన్న ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పునరావాస శిబిరాలను ఏర్పాటుచేసి బాధితులను ఆదుకునేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మంగ ళవారం గోదావరి వరద మరింత ఉగ్రరూపం దాల్చింది. బుధవారం పౌర్ణమి కావడంతో సముద్రం పోటెత్తి ముందుకు చొచ్చుకువచ్చే పరిస్థి తుల నేపథ్యంలో వరద ఉధృతి తీవ్రంగా ఉండొచ్చని అంచనా. గౌతమీ, వశిష్ఠ, వైనతేయ, వృద్ధగౌతమీ నదీపాయలు ఉధృతంగా ప్రవహిస్తుండ డంతో ఆయా ప్రదేశాల్లో ఉన్న కాజ్‌వేలు నీట మునిగాయి. ముక్తేశ్వరం- అయినవిల్లిలంక వెళ్లే కాజ్‌వే నీట మునగడంతో అయినవిల్లింక, వీర వల్లిపాలెం, అద్దంకివారిలంక గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించిపో యింది. ముక్తేశ్వరం-కోటిపల్లి రేవులో పంటు ప్రయాణాలు నిలిచిపోయా యు. చాకలిపాలెం, అప్పనరామునిలంక, అప్పనపల్లి కాజ్‌వేలపైకి వరద నీరు చేరుతుండడంతో ఆయా సమీప ప్రాంతాలకు రవాణా వ్యవస్థ స్తం భించింది. జిల్లాలో పద్దెనిమిది మండలాల పరిధిలోని 51 గ్రామాలు వర ద ముంపునకు గురవుతున్నాయి. ముమ్మిడివరం మండలం చింతావాని రేవు, కోరుమిల్లి సమీపంలోను ఏటిగట్లు బలహీనంగా ఉండడంతో తా త్కాలిక రక్షణ చర్యలు చేపట్టారు. అమలాపురంలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌  బృం దాన్ని సిద్ధం చేశారు. బోడసకుర్రు, గంటిపెదపూడితో సహా పలుచోట్ల అగ్నిమాపక సిబ్బంది, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను అధికారులు సిద్ధం చేశా రు. వశిష్ఠ గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో సఖినేటిపల్లి-నర్సాపురం రేవు లో పంటు రాకపోకలు నిలిపివేశారు. దొడ్డిపట్ల రేవులోనూ నిలిపివేశారు.

జిల్లాకు రూ.2 కోట్లు విడుదల..

కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉగ్రరూపం దాల్చుతున్న పరిస్థితు లపై అధికారులు అప్రమత్తమయ్యారు. సీఎం జగన్‌తో కలెక్టర్‌ హిమాన్షు శుక్లా వీడియో కాన్ఫరెన్సులో పాల్గొని జిల్లాలో వరద పరిస్థితిని వివరిం చారు. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారు లు సిద్ధంగా ఉన్నట్టు సీఎంకు నివేదించారు. వరద ముంపు బారిన పడి న ప్రజల పునరావాసం కోసం తక్షణం జిల్లాకు రూ.2 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. పునరావాస శిబిరం నుంచి ఇళ్లకు వెళ్లే బాధిత కుటుం బానికి రూ.2 వేల వంతున ఆర్థికసహాయాన్ని పంపిణీ చేయాలని ప్రభు త్వం ఆదేశించింది. జిల్లాలో 22 మండలాలు ఉండగా 18 మండలాల్లో 51 గ్రామాలు ముంపు బారినపడే అవకాశమున్నట్టు నివేధించారు. అమలా పురం సమీపంలో బోడసకుర్రు, ఐ.పోలవరం మండలం కేశనకుర్రుపా లెంలో పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. 400 బోట్లు, 925 మంది గజ ఈతగాళ్లను సిద్ధం చేసినట్టు నివేదికలో పేర్కొ న్నారు. మంచినీటి సమస్య ఉత్పన్నం కాకుండా 20 లీటర్ల టిన్నులను 1490, లక్షా 10వేల వాటర్‌ ప్యాకెట్లను సిద్ధం చేశారు. వరద తీవ్రత ఉన్న 51 గ్రామాల్లో గల 75 చౌకడిపోల ద్వారా బియ్యం, కందిపప్పు, కూర గాయలు వంటి వాటిని అందుబాటులో ఉంచారు. వైద్య శిబిరాలు నిర్వ హించడంతోపాటు గ్రామాల్లో అపారిశుధ్య పరిస్థితులు నెలకొనకుండా బ్లీచించ్‌, ఫినాయిల్‌, క్లోరిన్‌లు సిద్ధంగా ఉంచాల్సిందిగా పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. 358 మంది గర్భిణీలను గుర్తించి వారిలో డెలి వరీకి దగ్గరగా ఉన్న మహిళలను సమీపంలోని ప్రభుత్వాసుపత్రులకు ముందు జాగ్రత్తగా తరలించాల్సిందిగా ఆదేశించారు. ముఖ్యంగా అమలా పురం, రామచంద్రపురం ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పా టుతోపాటు గ్రామస్థాయిలోనూ కంట్రోల్‌ రూమ్‌లు నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2022-07-13T07:13:41+05:30 IST