Floods: మళ్లీ పెరుగుతున్న గోదావరి

ABN , First Publish Date - 2022-07-24T01:33:12+05:30 IST

గోదావరి (Godavari) మళ్లీ పెరుగుతోంది. శుక్రవారం రాత్రి భద్రాచలం వద్ద 41.90 అడుగులు నీటి మట్టం శనివారం సాయంత్రానికి

Floods: మళ్లీ పెరుగుతున్న గోదావరి

పోలవరం: గోదావరి (Godavari) మళ్లీ పెరుగుతోంది. శుక్రవారం రాత్రి భద్రాచలం వద్ద 41.90 అడుగులు నీటి మట్టం శనివారం సాయంత్రానికి నాలుగడుగులు పెరిగి 45.90 చేరుకుంది. తెలంగాణ (Telangana)లోని పలు ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడిప్పుడే వరద బాధితులు తిరిగి తమ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. మళ్లీ వరద పెరుగుతుందన్న సమాచారం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) ఎగువ కాపర్‌ డ్యామ్‌, స్పిల్‌ వే ఎగువన శనివారం ఉదయం 32.610 మీటర్లుగా ఉన్న నీటిమట్టం సాయంత్రానికి 32.860 మీటర్లకు పెరిగింది. దిగువ కాపర్‌ డ్యామ్‌, స్పిల్‌ వే దిగువన 24.140 మీటర్లుగా ఉన్న నీటిమట్టం సాయంత్రానికి 24.300 మీటర్లకు పెరిగింది. పోలవరం వద్ద 24.770 మీటర్లు నమోదైంది. ఎగువ నుంచి వస్తున్న 7,45,063 క్యూసెక్కుల వరద జలాలను జలవనరులశాఖ అధికారులు దిగువకు విడుదల చేశారు.

Updated Date - 2022-07-24T01:33:12+05:30 IST