హైదరాబాద్: గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ భేటీ ఆగస్టు 3న జరుగనుంది. హైదరాబాద్ జలసౌధలో సమన్వయ కమిటీ మొదటి సమావేశం నిర్వహిస్తున్నారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు, కార్యాచరణ ఖరారుపై చర్చ జరుగనుంది. భేటీలో గోదావరి బోర్డు సభ్యులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు, జెన్‌కో, ట్రాన్స్‌కో ఎండీలు పాల్గొననున్నారు.