Bhadrachalamలో Godavari ఉధృతి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..

ABN , First Publish Date - 2022-07-13T19:59:52+05:30 IST

భద్రాచలం (Bhadrachalam)లో గోదావరి (Godavari) కనీవినీ ఎరుగని రీతిలో ప్రవహిస్తోంది.

Bhadrachalamలో Godavari ఉధృతి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..

భద్రాచలం (Bhadrachalam)లో గోదావరి (Godavari) కనీవినీ ఎరుగని రీతిలో ప్రవహిస్తోంది. ఇప్పటికే 50 అడుగులు దాటిన గోదావరి నీటి మట్టం బుధవారం సాయంత్రానికి 60 అడుగులకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం 53 అడుగులు దాటడంతో జిల్లా కలెక్టర్ అనుదీప్ (Anudeep) మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతం సమ్మక్క బ్యారేజ్ (Sammakka barrage) నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భద్రాచలం నుంచి చర్ల, వాజేడు, వెంకటాపురం, వీఆర్ పురం, కూనవరం, చింతూరు మండలం వైపు రాకపోకలు స్తంభించాయి.

Updated Date - 2022-07-13T19:59:52+05:30 IST