గోదారి..ఎడారి!

ABN , First Publish Date - 2022-06-26T06:56:07+05:30 IST

గోదావరి ఎండిపోతోంది.. ఎన్నడూ లేనిది జీవనది జీవం కోల్పోతోంది.

గోదారి..ఎడారి!
గోదారమ్మ. ఏమైందమ్మా : కొవ్వూరు గోష్పాదక్షేత్రం వద్ద దిగువకు అఖండ గోదావరి

రోజురోజుకు తగ్గుతున్న నీటిమట్టం

తీవ్ర వర్షాభావ పరిస్థితులే కారణం

కొవ్వూరులో ప్రమాదకరంగా రేవు

 కానరాని కనీస రక్షణ చర్యలు


కొవ్వూరు, జూన్‌ 25 : గోదావరి ఎండిపోతోంది.. ఎన్నడూ లేనిది జీవనది జీవం కోల్పోతోంది. తీవ్ర వర్షాభావంతో కొవ్వూరు గోష్పాదక్షేత్రం ప్రధాన స్నానఘట్టం వద్ద నీరులేక రాళ్లు పైకిలేచి కనిపిస్తున్నాయి. ప్రతి ఏడాది జూన్‌ నెలలో ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు అధికంగా నదిలో చేరడంతో కొవ్వూరు, రాజమహేంద్రవరంల మధ్య అఖండ గోదావరి నిండు కుం డలా ప్రవహించేది. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో వర్షాభావం కారణంగా నదిలో నీటిమట్టం తగ్గి ఇసుకమేటలు పైకి లేచి గోదావరి నది ఎడారిని తలపిస్తుంది.   స్నానఘట్టాల్లో మెట్ల నుంచి సుమారు 9 మీటర్లు  నీటిమట్టం వెనక్కి వెళ్లిపోవడంతో ప్రమాదకరంగా మారింది. దీంతో గోదావరి పుణ్య స్నానాలు ఆచరించడానికి వచ్చిన యాత్రికులు, కొవ్వూరు పట్టణ పరిపర ప్రాంతాలకు చెందిన ప్రజలు స్నానఘట్టంలోని పైకి లేచిన రాళ్లను దాటి లోపలికి వెళ్లి స్నానాలు ఆచరిస్తున్నారు. క్షేత్రంలో ఎక్కడా ప్రమాద హెచ్చరిక బోర్డ్డులు ఏర్పాటు చేయకపోవడం,నది లోతును అంచనా వేయడంలో కొంతమంది తెలియక స్నానమాచరించడానికి లోపలికి వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. శనివారం ఉదయం పట్టణానికి చెందిన మద్దుల అనుదీప్‌ సోదరులతో కలిసి గోదావరి స్నానా నికి వెళ్లాడు. పుణ్యమాచరిస్తూ ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోయాడు. పక్కనే స్నానమాచరిస్తున్న స్థానికుడు రాజేశ్వర ప్రసాద్‌ రక్షించి అనుదీప్‌ను నది నుంచి బయటకు తీసుకొచ్చాడు. గోష్పాదక్షేత్రానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు, యాత్రికులు అధిక సంఖ్యలో వస్తుంటారు.గోదావరి స్నానాలు ఆచరి స్తారు. ఇప్పటికైనా అధికా రులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. 

Updated Date - 2022-06-26T06:56:07+05:30 IST