Godavari pollution: గోదావరిలోకి మహారాష్ట్ర మద్యం ఫ్యాక్టరీ వ్యర్థాలు

ABN , First Publish Date - 2022-07-24T16:35:08+05:30 IST

జీవనది గోదావరి (Godavari) గరళాన్ని మింగుతోంది. మహారాష్ట్ర (Maharashtra) మద్యం ఫ్యాక్టరీ వ్యర్థాలు బాసర

Godavari pollution: గోదావరిలోకి మహారాష్ట్ర మద్యం ఫ్యాక్టరీ వ్యర్థాలు

బాసర: జీవనది గోదావరి (Godavari) గరళాన్ని మింగుతోంది. మహారాష్ట్ర (Maharashtra) మద్యం ఫ్యాక్టరీ వ్యర్థాలు బాసర (Basara) దగ్గర గోదావరిలో కలుస్తున్నాయి. దీంతో పూర్తిగా  గోదావరి జలాలు కలుషితమవుతున్నాయి. ఏటా వరదల్లోకి మద్యం ఫ్యాక్టరీ వ్యర్థాలను వదులుతున్నారు. గోదావరి నది కలుషితం కావడంతో బాసర పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి పరివాహక పట్టణాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, మలినాలు గోదావరిలో కలుస్తున్నాయి. నదీ పరివాహాక ప్రాంతంలో పరిశ్రమలు, పట్టణాలు, గ్రామాల నుంచి వస్తున్న వ్యర్థాలు, మలినాలు పూర్తిస్థాయిలో శుద్ధి చేయకపోవడంతో గోదావరి నది తన పవిత్రతను కోల్పోతోంది.


ఇప్పటికే ఈ నదీ జలాలలో స్నానం చేసేవారితో పాటు, తాగునీటికి ఉపయోగించడం వల్ల వివిధ రకాల వ్యాధులు, రోగాలు వస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాలను నదిలో పూర్తిస్థాయిలో శుద్ధి చేయకుండా కలుపుతుండటంతో ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి. కేంద్రం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న గోదావరి జల కాలుష్య నివారణ పథకం మూలనపడింది. కనీసం ఒక్క ఏడాది పాటు కూడా నీటిని శుద్ధి చేసిన దాఖలాలు లేవు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో గోదావరి మరింతగా కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది.

Updated Date - 2022-07-24T16:35:08+05:30 IST