Abn Andhrajyothy Debate: జగన్ పర్యటనలో వరద బాధితులకు ఏమైనా ఒరిగిందా?

ABN , First Publish Date - 2022-07-29T01:19:24+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి....

Abn Andhrajyothy Debate: జగన్ పర్యటనలో వరద బాధితులకు ఏమైనా ఒరిగిందా?

అమరావతి/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఇక ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల గోదావరి (Godavari), కృష్ణా (Krishna) నదులకు భారీగా వరద ప్రవాహం చేరింది. దీంతో ఆయా నదీ పరివాహక ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోయాయి. పంట పొలాల్లో నీరు చేరడం వల్ల భారీగా నష్టం వాటిల్లింది. ప్రధానంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా ఏపీలో విలీనం అయిన మండలాల్లో పంట, ఆస్తి నష్టం తీవ్ర స్థాయిలో జరిగింది. 


దీంతో సీఎం జగన్ (Cm Jagan) ఆయా గ్రామాల్లో పర్యటించారు. వరద ప్రాంతాలను పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించారు. అయితే తాజాగా ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu) పర్యటిస్తున్నారు. వరద బాధితులను పరామర్శిస్తున్నారు.  ఈ నె 21, 22న  చంద్రబాబు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు.  కోనసీమ జిల్లా పి.గన్నవరం, రాజోలు, పాలకొల్లు, ఆచంటలో వరద బాధితులను పరామర్శించారు. వరద బాధితులకు అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.



ఈ నేపథ్యంలో ‘‘వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన ఎలాంటి ప్రభావాన్ని చూపింది. ప్రతిపక్ష నేత పరామర్శలు వరద బాధితులను ఊరడించాయా?. జగన్ పర్యటనలో వరద బాధితులకు ఏమైనా ఒరిగిందా?. తనది మానవత్వం కలిగిన ప్రభుత్వం అని జగన్ ఎందుకు చెప్పుకుంటున్నారు?. ఇంతకూ యాత్రలతో మోతెక్కుతున్న వరద ప్రాంతాలు కోలుకున్నాయా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ (Abn Andhrajyothy Debate) నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 



Updated Date - 2022-07-29T01:19:24+05:30 IST