మంజీరాలోకి గోదావరి!

ABN , First Publish Date - 2021-04-07T04:53:26+05:30 IST

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసినప్పటికీ నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి చుక్కనీరు వచ్చేది కాదు.

మంజీరాలోకి గోదావరి!
కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి హల్దివాగులోకి నీటిని విడుదల చేస్తున్న సీఎం కేసీఆర్‌, స్పీకర్‌ పోచారం

గోదావరి జలాలతో నిజాంసాగర్‌కు పూర్వ వైభవం
వర్గల్‌ వద్ద నీటిని విడుదల చేసిన సీఎం కేసీఆర్‌
ప్రస్తుతం 1600 క్యూసెక్కుల నీటి విడుదల
10 రోజుల తర్వాత నిజాంసాగర్‌కు చేరనున్న కొండపోచమ్మ నీరు
నిజాంసాగర్‌లోకి గోదావరి జలాలు చేరగానే నాగమడుగుకు పునాది
గోదావరి జలాల విడుదల సందర్భంగా జిల్లా నేతలకు హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌
ప్రతీ ఏటా సాగర్‌లోకి చేరనున్న 4 టీఎంసీల నీరు
సాగర్‌ ఆయకట్టు రైతాంగానికి రెండు పంటలకు ఢోకా లేనట్లే..
ఇకపై ఎప్పటికీ జలకళను సంతరించుకోనున్న నిజాంసాగర్‌
కామారెడ్డి, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసినప్పటికీ నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి చుక్కనీరు వచ్చేది కాదు. దీనికి కారణంగా ఎగువన మంజీర నదిపై కర్ణాటక, మహారాష్ట్రలు అనేక చెక్‌డ్యాంలు కట్టడంతో దిగువకు నీరు రావడం లేదు. దీనిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం జలాలతో నిజాంసాగర్‌ నింపాలని లక్ష్య ంగా పెట్టుకుంది. అనుకున్న లక్ష్యానికి తగ్గట్టుగానే ఎట్టకేలకు గోదావరి జలాలతో నిజాంసాగర్‌ నింపేందుకు సీఎం కేసీఆర్‌ చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించారు. ఎక్కడ కాళేశ్వరం.. ఎక్కడ నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నుంచి కొండపోచమ్మ మీదుగా నిజాంసా గర్‌ ప్రాజెక్ట్‌లోకి గోదావరి జలాలను మళ్లించారు. కొండపో చమ్మ ప్రాజెక్ట్‌ నుంచి సుమారు 96 కి.మీ.లు ప్రయాణించి నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి ప్రతీఏట 4 టీఎంసీల నీటిని తరలి ంచనున్నారు. ఈ మహోన్నతమైన కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ మంగళవారం సిద్దిపేట జిల్లాలోని వర్గల్‌ మండలం వద్ద గోదావరి జలాలను హల్దివాగులోకి విడుదల చేశారు. 10 రోజుల తర్వాత ఈ గోదావరి జలాలు మంజీర నది నీరు గా నిజాంసాగర్‌కు చేరనున్నాయి. దీంతో ఉమ్మడి నిజామా బాద్‌ జిల్లాలోని నిజాంసాగర్‌ ఆయకట్టు రైతులకు రెండు పంటలకు ఢోకా ఉండదని వర్షాలపై ఆధారపడకుండా ప్రాజె క్ట్‌ నీటితోనే విస్తారంగా సాగు చేసుకోవచ్చని ప్రజాప్రతినిధు లు, అధికార వర్గాలతో పాటు రైతు సంఘాలు సైతం పేర్కొ ంటున్నాయి. సీఎం కేసీఆర్‌ కొండపోచమ్మ నుంచి నిజాం సాగర్‌కు గోదావరి జలాల తరలింపుపై ఉమ్మడి జిల్లాల రైతా ంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గోదావరి జలాలను విడుదల చేసిన సీఎం కేసీఆర్‌
సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలంలో కొండపోచమ్మ రిజర్వా యర్‌ నుంచి హల్దివాగులోకి సీఎం కేసీఆర్‌ మంగళవారం కాళేశ్వరం జలాలకు పూజలు నిర్వహించి విడుదల చేశారు. హల్దివాగు నుంచి ఈ గోదావరి జలాలు మంజీర నదిలో కలవనున్నాయి. మంజీర నది మీదుగా నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ కు చేరుతాయి. జలాల విడుదల కార్యక్రమంలో సీఎం కేసీ ఆర్‌తో పాటు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్థిక శాఖమం త్రి హరీష్‌రావు, జిల్లా ప్రజాప్రతినిధులైన ఎంపీ బీబీ పాటిల్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, జిల్లా నీటిపారుదలశాఖ సీఈ శ్రీనివాస్‌ తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం కొండ పోచమ్మ రిజర్వాయర్‌ నుంచి వర్గల్‌ వద్ద రిడ్జ్‌ కెనాల్‌ నుంచి 16 వందల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది.
కొండపోచమ్మ టు నిజాంసాగర్‌
వయా హల్దివాగు, మంజీర
సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్‌ నుంచి నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం డిజైన్‌ చేసి ంది. అది సాధ్యం కాదని గుర్తించి కొండపోచమ్మ రిజర్వాయ ర్‌ నుంచి హల్దివాగు మీదుగా మంజీర నదిలోకి గోదావరి జలాలను నిజాంసాగర్‌లోకి తరలించేందుకు ప్రణాళికను రూపొందించి రీడిజైన్‌ చేశారు.హల్దినది సంగారెడ్డి కాలువ మీదుగా వెళ్లి మంజీరా నదిలో సింగూరు దిగువన నిజాం సాగర్‌ ఎగువన కలుస్తోంది. కొండపో చమ్మ నుంచి సంగారెడ్డి కాలువ 6 కిలో మీటర్ల వరకు కాలువ తవ్వి నీటిని తరలిస్తే అక్కడ నుంచి మంజీరాలో కలిసి నిజాంసాగర్‌కు వెళ్తాయి. ఈ మధ్య లో హల్దినదిపై ఉన్న కానుచెరువుకు నీటిని మళ్లిస్తారు. అది ఓవర్‌ప్లో అయి దిగువన మరో నాలుగు చెరువుల ను నింపి నిజాంసాగర్‌ పైన మంజీరాలో కలుస్తోంది. ఇలా హల్దివాగు నుంచి రెండువేల క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి వదిలి నిజాంసాగర్‌ను నింపనున్నారు. ప్రతీ ఏటా కొండపోచమ్మ నుంచి నిజాంసాగర్‌కు నాలు గు టీఎంసీల నీటిని వదలనున్నారు.
4 చెరువులు.. 31 చెక్‌డ్యాంలు దాటి రావాలి
సీఎం కేసీఆర్‌ మంగళవారం సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం వద్ద కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి గోదావరి జలాలను హల్దివాగులోకి 1600 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఈ వర్గల్‌ నుంచి నిజాంసాగర్‌ ప్రాజె క్ట్‌కు గోదావరి జలాలు చేరాలంటే సుమారు 96 కి.మీ నీరు ప్రయాణించాల్సిందే. ఈ 96 కి.మీల మధ్యలో ఉన్న 4 చెరువులు, 31 చెక్‌డ్యాంలు నిండిన తర్వాతనే నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు కాళేశ్వరం నీరు చేరనుంది. వర్గ ల్‌ మండలం నుంచి ఆరు కిలోమీటర్ల మధ్యలో ఉన్న బందెం చెరువు, పెద్ద చెరు వు, ధర్మాయి చెరువు, ఖాన్‌ చెరువు నిండి అక్కడ హల్దివాగులోకి పడతాయి. ఈ వాగు నుంచి సుమారు 70కిలో మీటర్లు ప్రయాణి ంచి మెదక్‌లోని ర్యాలమడుగు గ్రామం వద్ద మంజీరా నది లోకి చేరుతాయి. ఇక్కడ నుంచి 22 కిలోమీటర్ల పరిధి లోని 31 చెక్‌డ్యాంల మత్తడి దూకి నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ లోకి చేరుతాయి. ఇలా సుమారు 10 రోజుల పాటు 96 కి.మీలు గోదావరి జలాలు హల్దివాగు మంజీరా నది గుండా ప్రయాణించి నిజాంసాగర్‌లోకి చేరుతాయి. నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి గోదావరి జలాలు చేరగానే ప్రాజెక్ట్‌ దిగువన చేపట్టనున్న నాగమడుగు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆరే పునాది వేస్తానని గోదావరి జలాల విడుదల సందర్భంగా జిల్లా ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఇలా ప్రతీ ఏడాది కొండపోచమ్మ రిజ ర్వాయర్‌ నుంచి 4టీఎంసీల నీటిని విడుదల చేయను న్నారు.
ఆయకట్టు రైతులకు ఢోకా లేనట్టే..
నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ కింద ప్రస్తుతం 2 లక్షల ఎకరా లకు పైగా సాగునీరు అందుతోంది. వర్షాభావ పరిస్థి తులు ఉన్న సమయంలో నిజాంసాగర్‌ నిండకపోతే బోరు బావులపైనే రైతులు పంటలు సాగు చేయడం లేకుంటే వేసిన పంటలు ఎండిపోతుండేవి. అయితే వర్షాలపై ఆధారపడకుండా నిజాంసాగర్‌ను 365 రోజు లు నీటితో కళకళలాడేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నిజాంసాగర్‌ను గోదావరి జలాలతో నింపేందుకు చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగానే కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి హల్ది వాగు ద్వారా మంజీరాలోకి గోదావరి జలా లను వదిలి నిజాంసాగర్‌ను నింపనున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని రైతాంగానికి ఏడాదికి రెండు పంటలకు సమృద్ధిగా సాగునీరు అందనుంది. ప్రస్తుతం నిజాం సాగర్‌లో 7.02 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇప్పటి వరకు ఐదు విడతలుగా ప్రాజెక్ట్‌ నుంచి సాగు నీటిని వదిలారు. ప్రస్తుతం 6వ విడత కింద నీటి విడుదల కొనసాగుతోంది. దీంతో ఆరు టీఎంసీలకు నీరుచేరే అవకాశం ఉంది. అయితే మంగళవారం కొండ పోచమ్మ నుంచి గోదావరి జలాలను విడుదల చేయడం తో పది రోజుల్లో నిజాంసాగర్‌కు ఒక టీఎంసీ నీరు చేరనుంది. వచ్చే వర్షాకాలంలోనూ నిజాంసాగర్‌ నుంచి ఉమ్మడి జిల్లాల రైతులకు సాగునీరు అందించనున్నారు.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు
గోదావరి జలాలను కొండపోచమ్మ జలాశయం నుం చి సంగారెడ్డి కాలువ ద్వారా హల్దివాగులోకి విడుదల చేశారు. ఈ నీరు ఉమ్మడి జిల్లా వర ప్రధాయిని అయి న నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు చేర నుంది. దీంతో ఆయకట్టు రైతులకు సాగు నీటికి ఢోకా లేదన్నారు. ఈ సందర్భం గా ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను ఎర్రవల్లిలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ, ఎంపీ బీబీ పాటిల్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, నిజామా బాద్‌ జడ్పీ చైర్మన్‌ విఠల్‌రావు, శాసన మండలి సభ్యు డు వీజీగౌడ్‌, రాజేశ్వర్‌, డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, స్టేట్‌ మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ గంగారెడ్డి తదిత రులు పాల్గొన్నారు.

రెండు పంటలకు ఢోకా లేదు
శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వర ప్రధాయినిగా ఉన్న నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌  గత కొన్ని సంవత్సరాలుగా పూర్వ వైభవం కోల్పోతూ వచ్చింది. కొండ పోచమ్మ రిజర్వాయర్‌ నుంచి నిజాంసాగర్‌కు గోదావరి జాలాల తరలింపుతో ప్రాజెక్ట్‌ ఆయకట్టుకు ప్రతీ యేటా రెండు పంటలకు ఢోకా లేదని తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పించింది. అపార భగీర థుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టుదలతో గోదావరి జాలాలు వంద కిలో మీటర్లు వెనుకకు ప్రయాణించి  కరువు పీడిత భూములను ముద్దాడింది. అద్భుతమైన ఇంజనీరింగ్‌ పరిజ్ఞానంతో కాళేశ్వరం ప్రాజె.క్ట్‌లోని మేడిగడ్డ వద్ద సముద్ర మట్టానికి వంద మీటర్లు ఎత్తు నుంచి ఆరు వందల మీటర్ల ఎత్తులోని కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్ట్‌కు గోదావరి జాలాలను తరలించి అక్క డి నుంచి హల్దివాగు ద్వారా మంజీరా నదిలోకి తీసుకరావడం అద్భతం. మంజీరా నదిలోకి వచ్చే గోదావరి జాలాలు నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ చేరడం ద్వారా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని ఆయ కట్టు భూములకు తిరిగి పూర్వవైభవం రానుంది. ఉమ్మడి జిల్లాలోని రైతాంగానికి ప్రతీయేట రెండు పంటలు సాగు చేసుకునే అవకాశం దొరకడంతో సాగు నీటి కోసం తిప్పలు పడే పరిస్థితి లేకుండా పోయింది. ఈ సందర్భంగా ఉమ్మడి  నిజామాబాద్‌  జిల్లా ప్రజలకు రైతులకు శూభా కాంక్షలు తెలిపారు.

సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైంది
హన్మంత్‌షిండే, ఎమ్మెల్యే, జుక్కల్‌
కాళేశ్వరం నీరు నిజాంసాగర్‌ను నింపడం అనేది కళలో కూడా ఊహించనిది. ఇది కేవలం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైంది. గోదావరి నదికి సరికొత్త నడకలు నేర్పిన అపా రభగీరథుడు కేసీఆర్‌. తన వైవిధ్యమైన ఆలోచనా శక్తితో చారిత్రక నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ను ఉజ్వల కాం తులు నింపడానికి కృషి చేశారు. 20ఏళ్లుగా బోసిపోతున్న నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు ఊపిరిపోసే విధంగా కొండ పోచమ్మ సాగర్‌ ద్వారా మంజీరా నదికి జలకళ సంతరించుకోవడం నిజాంసాగర్‌ నిండిపోవడం, ఉమ్మ డి నిజామాబాద్‌ జిల్లా రైతాంగానికి జలపండుగ లాంటిది. వర్షాలపై ఆధారపడకుండా, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినప్పటికీ నిజాంసాగర్‌కు ఎలాంటి నీటి కొరత ఉండదు. నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ కింద రూ.476 కోట్లతో నిర్మించనున్న నాగమడుగు లిఫ్ట్‌ ఇరిగేషన్‌తో జుక్కల్‌ నియోజక వర్గంలోని నాలుగు మండలాల్లో 40వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. గోదావరి జలాలు నిజాంసాగర్‌కు చేరుకోగానే సీఎం కేసీఆర్‌ నాగమడుగు లిఫ్ట్‌కు పూనాది వేయనున్నారు.

పది రోజుల తర్వాత నిజాంసాగర్‌కు చేరుతాయి
శ్రీనివాస్‌, సీఈ, నీటి పారుదలశాఖ, కామారెడ్డి
వర్గల్‌ నుంచి సీఎం కేసీఆర్‌ 1600 క్యూసెక్కుల నీటిని కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి విడుదల చేశారు. ఈ గోదావరి జలాలు హల్దివాగు నుంచి మంజీరా నదిలో పడతాయి. అక్కడి నుంచి సుమారు 22 కిలో మీటర్లు ప్రయాణించి నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి చేరుతా యి. ఈ గోదావరి జలాలు సాగర్‌కు చేరాలంటే సుమారు 10 రోజుల సమయం పడుతోంది. 14 రోజు లకు సాగర్‌లోకి ఒక్క టీఎంసీ నీరు చేరనుంది. ఇలా ప్రతీఏటా నాలుగు టీఎంసీల నీరు నిజాంసాగర్‌ లోకి కొండపోచమ్మ రిజర్వాయర్‌ ద్వారా వస్తాయి.

Updated Date - 2021-04-07T04:53:26+05:30 IST