కాస్త నిలకడగా..

ABN , First Publish Date - 2021-07-26T06:01:16+05:30 IST

గోదావరి నీటిమట్టం పోల వరంలో ఆదివారం నిలకడగా ఉంది.

కాస్త నిలకడగా..
పోలవరం వద్ద.. గోదారి కళకళ

భద్రాచలం వద్ద తగ్గిన నీటిమట్టం

గోష్పాదక్షేత్రం వద్ద పెరిగిన ఉధృతి

ధవళేశ్వరం నుంచి 10 లక్షల 11 వేల క్యూసెక్కుల వరదనీరు సముద్రంలోకి..


పోలవరం/ కొవ్వూరు జూలై 25: గోదావరి నీటిమట్టం పోల వరంలో ఆదివారం నిలకడగా ఉంది. ఎగువున భద్రాచలం వద్ద ఆదివారం రాత్రి 40.30 అడుగులకు నీటిమట్టం తగ్గుము ఖం పట్టింది. దీంతో  గోదావరి నిలకడగా ప్రవహిస్తున్నది. పోలవరం బోట్‌ పాయింట్‌ వద్ద ఉదయం 5 గంటలకు 24.81 మీటర్లుగా ఉన్న నీటిమట్టం 23.512కు తగ్గింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 32.865 మీటర్లుగా నమోదవగా స్పిల్‌వే దిగువన 25.108 మీటర్లు నమోదైంది. ఎగువ కాఫర్‌ డ్యాం వద్ద 34.380 మీటర్లు నమోదు కాగా, దిగువ కాఫర్‌డ్యాం వద్ద 24 మీటర్లు నీటిమట్టం నమోదైంది. ఆదివారం ఉదయం స్పిల్‌వే నుంచి 8,32,509 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేయగా సాయంత్రం 8,76,920 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గోదావరి నీటిమట్టం పెరగడంతో వరద జలాలు పోలవరం కడెమ్మ వంతెనను తాకుతున్నాయి. కడెమ్మ స్లూయిజ్‌ గేట్లు పూర్తిగా మునిగిపోయాయి. నీటిమట్టం మరిం త పెరిగితే కడెమ్మ వంతెన నీటమునిగి పోలవరం ప్రాజెక్టు వెళ్లే రోడ్డు మార్గం జలమయం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక


కొవ్వూరు గోష్పాదక్షేత్రం వద్ద  ప్రధాన స్నానఘట్టాలను వరద ముంచెత్తింది. ఇదే ఉధృతి కొనసాగితే రాత్రికి క్షేత్రంలోని ఆలయాలలోకి వరదనీరు చేరుకునే అవకాశం లేకపోలేదు.ధవళేశ్వరం వద్ద ఆదివారం  రాత్రి 10 గంటలకు 11.80 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. దీంతో వాటర్‌ వర్క్సు అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద 11.75 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. రాత్రి 10 లక్షల 11 వేల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేశారు. కొవ్వూరు పట్టణ సీఐ మూర్తి గోష్పాదక్షేత్రంలో పర్యటించి నది ప్రవాహం ఉధృతంగా ఉన్నందున ఎవరూ దిగవద్దని పర్యాటకులను హెచ్చరించారు


 ముంపు గ్రామాల్లో చర్యలు : జేసీ హిమాన్షు 


ముంపు గ్రామాల్లో ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని జేసీ హిమాన్షుశుక్లా అధికారులను ఆదేశించారు. ఆదివారం పోలవరం ప్రాజెక్టు కాఫర్‌ డ్యాం వద్ద ముంపు గ్రామాల్లోని నిర్వాసితులకు నిత్యావసరాలు తరలించే కార్యక్ర మాన్ని ఐటీడీఏ పీవో ఆనంద్‌, జంగారెడ్డిగూడెం ఆర్‌డీవో ప్రసన్నలక్ష్మిలతో కలిసి పరిశీలించారు. నిర్వాసితుల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని తహసీల్దార్‌ సుమతికి సూచించారు. ప్రాజెక్టు ఎగువ గ్రామాలైన వాడపల్లి, తూతిగుం ట, శివగిరి, కొరుటూరు, సిరివాకల్లోని బాధితులకు సరఫరా చేయడానికి వాటర్‌ ప్యాకెట్ల బస్తాలు, దోమల కాయిల్స్‌, కూర గాయలు, కిరాణా సరుకులతో ప్రత్యేక లాంచీపై సివిల్‌ సప్లైస్‌ డిప్యూటీ తహసీల్దార్‌ దుర్గామహాలక్ష్మి ఆధ్వర్యంలో, స్థానిక రేషన్‌ డీలర్లు, రెవెన్యూ సిబ్బంది తరలివెళ్లారు.


ముంపులోనే పొలాలు

డెల్టాలో ఎగదన్నుతున్న డ్రెయిన్లు

భీమవరం, జూలై 25 : మేజర్‌ డ్రెయిన్లలో వరదనీరు పోటెత్తడంతో డెల్టాలో పంటలు మునిగాయి. ప్రధాన డ్రెయిన్లన్నీ ఇప్పుడు వరద నీటితో ప్రవహిస్తున్నాయి. జిల్లాలో ప్రధాన డ్రెయిన్‌ ఉప్పుటేరు రెండు రోజులుగా ప్రవాహం పెరిగి ఎగదన్నుతోంది. ఉండి నియోజకవర్గం లోని బొండాడ, కోపల్లి చానళ్లదీ అదే పరిస్థితి. రుద్రాయ కోడు, మొగదిండి కొంతవరకు తగ్గినా అడ్డాల క్రీక్‌ ద్వారా ఉప్పుటేరుకు సముద్రం పోటు తగిలి నీరు ఎగదన్నడంతో వరి చేలు నీట మునిగిపోయాయి. ఇది కాళ్ళ మండలంలో పది తీర గ్రామాలపై ప్రభావం చూపుతోంది. మేజర్‌ డ్రెయిన్లు గొంతేరు, యనమదుర్రు, గోస్తనీ, నక్కల కాలు వలు పొంగుతున్నాయి. యనమదుర్రు డ్రైయిన్‌ ఉధృతం గా ప్రవహిస్తోంది. గోస్తనీలో నీటి ప్రవాహం పెరగడంతో పెనుమంట్ర, అత్తిలి మండలాల్లో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. గొంతేరులో నీటి ప్రవాహం పెరగడంతో పెనుమంట్రలో కొంతభాగం, వీరవాసరం మండలాలలో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రాంతాల్లో వరి చేలు నీటితో నిండుగా ఉన్నాయి. ఉప్పుటేరు పరి వాహకంలోని కాళ్ళ మండలంలోనే ఏడు వేల ఎకరాల్లో  నీరు బయటకు లాగడం లేదు. వరి నారుమడులు, వరి నాట్లు మునగడంతో మరో దఫా నారుమడులు వేయవ లసిన పరిస్థితి ఏర్పడిందని రెతులు అంటున్నారు.




Updated Date - 2021-07-26T06:01:16+05:30 IST