నిలకడగా గోదావరి

ABN , First Publish Date - 2021-06-24T07:41:10+05:30 IST

రెండు రోజుల క్రితం మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతాలకు పోటెత్తిన గోదావరి బుధవారం నిలకడగా ఉంది. ఎగువ ప్రాంతంలోని పలు ప్రాజెక్టుల నుంచి వరద నీటిని వదలడంతో దేవీపట్నం వద్ద గోదావరి నీరు పెరిగింది. దీంతో 30 గ్రామాల ప్రజలు తమ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు.

నిలకడగా గోదావరి

  • జలదిగ్బంధంలోనే  పలు లంక గ్రామాలు 

దేవిపట్నం, జూన్‌ 23: రెండు రోజుల క్రితం మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతాలకు పోటెత్తిన గోదావరి బుధవారం నిలకడగా ఉంది. ఎగువ ప్రాంతంలోని పలు ప్రాజెక్టుల నుంచి వరద నీటిని వదలడంతో దేవీపట్నం వద్ద గోదావరి నీరు పెరిగింది. దీంతో 30 గ్రామాల ప్రజలు తమ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న 42 గ్రామాల ప్రజలకు సంబంధించి ప్రతి గ్రామంలో కూడా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పెండింగ్‌ ఉంది. కొన్నిరోజుల క్రితం కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, ఆర్డీవో శీనానాయక్‌ దేవీపట్నంలో నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెలాఖరున ఈ గ్రామానికి సంబంధించి అర్హులందరికీ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈ ప్యాకేజీ ఆగస్టు నెల తర్వాతే ఖాతాల్లో జమ అవ్వొచ్చని పలువురి నోట వినిపిస్తోంది.

Updated Date - 2021-06-24T07:41:10+05:30 IST