ఉప్పొంగుతున్న గోదావరి

ABN , First Publish Date - 2022-08-20T06:35:35+05:30 IST

గోదావరి ఉధృ తంగానే ఉంది. ఎగువన భద్రాచలం వద్ద వరద ఉధృతి తగ్గినా రాజమహేంద్రవరంలో మాత్రం ఘాట్లను చేరి సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది.

ఉప్పొంగుతున్న గోదావరి
రాజమహేంద్రవరం దోబీఘాట్‌ వద్ద వరద ఉధృతి

రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 19: గోదావరి  ఉధృ తంగానే ఉంది. ఎగువన భద్రాచలం వద్ద వరద ఉధృతి తగ్గినా  రాజమహేంద్రవరంలో మాత్రం ఘాట్లను చేరి  సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది. ఈ నెల ఆరంభం లో వచ్చిన గోదావరి కంటే ఈ దపా వరద తక్కువే అయినా ఉధృతంగా ఉంది. గోదావరి ఎగువ ప్రాంతంలో   కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహనం పెరిగింది. రాజమహేంద్రవరం నగరంలో కోటిలింగాల రేవు, పుష్కరాల రేవు, టీటీటీ ఘాట్‌, దోబీఘాట్‌, గౌతమ ఘాట్లను అనుకుని వరద నీరు ప్రవహిస్తుంది. వచ్చిన నీటిని వచ్చినట్టే సముద్రంలోకి ధవళేశ్వరం బ్యారేజీ గుండా వదిలేయడంతో ప్రవాహం వేగంగా సాగుతుంది. గురువారం  ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద నీటి మట్టం ఉదయం 7 గంటలకు 15.60  అడుగులుగా ఉంది.   ధవళేశ్వరం నుంచి 12,34,930 క్యూసెక్కుల నీటిని  దిగువకు విడుదల చేస్తున్నారు.సాయంత్రం 6గంటలకు 15.10 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తుది.  రెండో  ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. శనివారం నాటికి వరద తగ్గుముఖం పడితే రెండో ప్రమాద హెచ్చరిక ఎత్తివేసే అవకాశం ఉంది. ప్రస్తుతం వరద ప్రవాహం  కారణంగా రాజమహేంద్రవరంలో గోదావరి స్నానాల రేవుల్లోకి ఎవ్వరిని అనుమతించడం లేదు. 


Updated Date - 2022-08-20T06:35:35+05:30 IST