ముంపు..ముచ్చెమటలు

ABN , First Publish Date - 2021-06-14T04:49:41+05:30 IST

నిర్వాసిత గ్రామాల్లో కంటిమీద కునుకులేదు .గోదావరి వడ్డున ఇంత కాలం తినో తినకో కాలం గడిపేసిన కుటుంబా లన్నీ రాబోయే వరదలను తలచుకుని గడగడలాడుతున్నాయి.

ముంపు..ముచ్చెమటలు
కోయిద గ్రామంలో కొండలపై ఇళ్లు నిర్మించుకుంటున్న గిరిజనులు

విలీన మండలాల్లో బిక్కు..బిక్కు

భయపెడుతున్న కాఫర్‌ డ్యామ్‌

భారీ వరద వస్తే ఈ సారి అంతే..!

గడగడలాడుతున్న గ్రామాలు 

కొండల మీద ఇళ్ల నిర్మాణం.. 

అశ్వారావుపేటకు వలస


నిర్వాసిత గ్రామాల్లో కంటిమీద కునుకులేదు .గోదావరి వడ్డున ఇంత కాలం తినో తినకో కాలం గడిపేసిన కుటుంబా లన్నీ రాబోయే వరదలను తలచుకుని గడగడలాడుతున్నాయి. గతేడాదే కాఫర్‌ డ్యామ్‌ కారణంగా భారీ వరద ముంపును చవిచూశారు. అప్పుడు డ్యామ్‌ కుడి ఎడమలవైపు ఖాళీలు ఉండగా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పూర్తిగా మూసివేశారు. ఈసారి వరదొస్తే ముంపు మండ లాలను ముంచేస్తుందనే భయంతో గిరిజనులు కొండ ప్రాంతాల్లో ఆవాసాలకు ప్రయత్నిస్తున్నారు. కాస్త స్థోమత ఉన్న వారు అశ్వారావుపేట సమీపంలో తాత్కాలిక ఇళ్లకు, ఇంకాస్త స్థోమత ఉన్నవారు అద్దె ఇళ్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఎవరిని కదిపినా గోదావరి ముంచె త్తడం ఖాయమనే ఆందోళనే కనిపిస్తోంది..


(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

కుక్కునూరు, వేలేరుపాడుల్లో గోదావరి వడ్డున ఉన్న వారంతా భయంతో బిగుసు కుపోతున్నారు.1986లో గోదావరి ఉగ్ర రూపం దాల్చినప్పుడు ఈ రెండు మండలాలను భారీ వరద చుట్టుముట్టింది. ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని అప్పుడా ఆ ‘గండం’ దాటేశారు. గతేడాది భద్రాచలం వద్ద 62 అడుగుల నీటి మట్టం చేరేసరికే ఈ రెండు మండలాల్లోనూ వరద నీరు చొచ్చుకువచ్చింది. సాధారణంగా భద్రాచలం నీటి మట్టం పెరిగే కొద్దీ వరద ఉరకలు పెట్టేది. గతేడాది కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం కారణంగా వరద నీరు కాస్త ముంపు మండలాలవైపు మళ్లింది. వారికి వారంపాటు కంటి మీద కునుకులేకుండా చేసింది. రెండు వారాల పాటు విద్యుత్‌ లేకుండా గడిపారు. ఈ ఏడాది వరద తీవ్రతపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జూన్‌ మొదటి వారం నాటికి గోదావరిలో పెద్దగా నీరుండేది కాదు. ఇసుక తిప్పలు దర్శనం ఇచ్చేవి. కాఫర్‌ డ్యామ్‌ కారణంగా ఈ ఏడాది భిన్నమైన పరిస్థితి. గోదావరిలో పుష్కలంగా నీరు చేరింది. ఆగస్టు మొదటి వారం నాటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అధికారులు గోదావరి పరివాహంలో ఈసారి నీటి మట్టాలు అనూహ్యంగా పెరగబోతున్నా యంటూ హెచ్చరిస్తున్నారు. వరదలకు ముందుగానే ఊళ్లు ఖాళీ చేయాలంటూ చాటింపు..వీరిని మరింత ఆందోళనలో పెట్టింది. సహాయ పునరావాసం కింద ప్రభుత్వం చెల్లించాల్సిన ప్యాకేజీని ఇస్తే తక్షణం ఇళ్లు ఖాళీ చేస్తామని నిర్వాసిత కుటుంబాలు చెబుతున్నాయి. ‘ఊహ తెలిసిన దగ్గర నుంచి గోదావరి ఒడ్డునే బతుకుతున్నాం. నడి గోదావరిలోనూ పడవ మీద ప్రయాణించే వాళ్లం. 1986లో వరద వచ్చినప్పుడు మాత్రం పిల్లాపాపలతో కాస్త మెరక ప్రాంతానికి వెళ్లాం. అప్పుడు భయపడలేదు. ఇప్పుడేమో వేసవి ముగిసి ముగియకలోపే గోదావరి సముద్రంలా కనిపిస్తోంది’’ అంటూ వేలేరుపాడుకు చెందిన నాగేశ్వరరావు తన అనుభవం చెప్పాడు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఎవరిని కదిపినా ఇప్పుడు ఇలాంటి భయాందోళనలే వినిపిసున్నాయి. 


కొండలపై ఆవాసాలు 

రాబోయే వరద తీవ్రత ఉధృతంగా ఉండబోతోందని హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో గిరిజనులు ఇప్పటికే ఎత్తైన కొండల్లో ఆవాసాలు వేసేందుకు సిద్ధపడు తున్నారు. వేలేరుపాడు మండలం కోయిద గ్రామంలో ఇలాంటి పరిస్థితే ఉంది. గ్రామ శివారుల్లో ఉన్న కొండకు ఒకవైపున తాత్కాలికంగా ఇళ్లు నిర్మించుకునే పనిలో పడ్డారు. వెదురు బొంగులు, తాటాకులతో ఎక్కడికక్కడ పాకలు వంటి వి వేసుకుంటున్నారు. గతేడాది వరదలు వచ్చిన సమయంలో కూడా కొయిదా గ్రామస్తులు ఇలాంటి పద్ధతులనే పాటించారు.  


ఇప్పుడా పరిస్థితి ఉందా 

గతేడాది వరద వచ్చినా కొంతలో కొంత త్వరగానే శాంతించింది. ముంపు ప్రాంతాల్లో ఉన్న వారంతా తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి ఉందా అనేది అందరిలోనూ అనుమానమే. గోదావరి వడ్డుకు సుమారు రెండు కిలోమీటర్లు దూరాన ఉన్న వేలేరుపాడుకు అప్పట్లో నాలుగు నుంచి ఐదు అడుగుల వరద నీరు చేరింది. ఓ వైపు శబరి నుంచి, మరోవైపు భద్రాచలం నుంచి భారీగా వరద రావడం, ఇంకోవైపు పోలవరం ప్రాజెక్టు సమీపాన కాఫర్‌ డ్యామ్‌ గోదావరి ప్రవాహానికి అడ్డుగా వున్న నేపథ్యంలో అప్పుడా పరిస్థితి నెల కొంది. కోయిద గ్రామానికి గోదావరి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది. అయినా గోదావరి వరద తాకిడికి ముంపునకు లోనైంది. కానీ ఇప్పుడు గతంలో కంటే కాఫర్‌ డ్యామ్‌ గరిష్ట ఎత్తుకు పెంచే ప్రయత్నం చేస్తు న్నారు. గత వరద సమయంలో ఉన్న నీటికంటే అదనంగా మరో ఆరు మీటర్ల వరద చొచ్చుకువచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇంతకు ముందు కాఫర్‌ డ్యామ్‌కు ఇరుపక్కలా కొంత ఖాళీ ఉంచి వరద నీరు దిగువకు పాకే అవకాశం కల్పించారు. ఇప్పుడా పరిస్థితి లేదు.అందువల్ల ఒకవైపు స్పిల్‌వే వైపు నీరు మళ్ళి స్తున్నా భయం వెంటాడుతోంది. జంగారెడ్డిగూడెం నుంచి ఈ రెండు మండలాలకు విద్యుత్‌ సరఫరా చేస్తారు. గతంలో పెదవాగు సమీపంలో ఉన్న విద్యుత్‌ స్తంభాలు నీట మునిగినా పది రోజుల్లో విద్యుత్‌ పునరుద్ధరించ గలిగారు. ఇప్పుడు రోజుల తరబడి ముంపులోనే నీరు నిల్వ ఉండే అవ కాశం ఉంది. అటువంటప్పుడు విద్యుత్‌ సరఫరాను ఎప్పటిలోపు పున రుద్ధరిస్తారనేది ఊహించడం కష్టమేనని స్థానికులు అంటున్నారు. 




Updated Date - 2021-06-14T04:49:41+05:30 IST