పెరుగుతున్న గోదావరి వరద

ABN , First Publish Date - 2022-08-17T06:05:28+05:30 IST

ఉపనదులు ప్రాణహిత, ఇంద్రా వతి ఉప్పొంగి ప్రవ హిస్తూ గోదావరిలో కలుస్తూ ఉండటంతో గోదావరి మరలా ఉధృతమై ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద మంగళవారం ఉదయం 8 గంటల వరకు తగ్గిన నీటిమట్టం 13.70 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చ రికను ఉపసంహరిస్తూ ఫ్లడ్‌ కన్జర్వేటర్‌ ఆదేశాలు జారీ చేశారు.

పెరుగుతున్న గోదావరి వరద

ధవళేశ్వరం, ఆగస్టు 16: ఉపనదులు ప్రాణహిత, ఇంద్రా వతి ఉప్పొంగి ప్రవ హిస్తూ గోదావరిలో కలుస్తూ ఉండటంతో గోదావరి మరలా ఉధృతమై ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద మంగళవారం ఉదయం 8 గంటల వరకు తగ్గిన నీటిమట్టం 13.70 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చ రికను ఉపసంహరిస్తూ ఫ్లడ్‌ కన్జర్వేటర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆపై 8గంటలపాటు నిలకడగా కొనసాగిన  మధ్యాహ్నం 4గంటలకు 13.75 అడుగులకు పెరగడంతో మరలా రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. రాత్రి 11 గంటలకు నీటిమట్టం 14.15 అడుగులకు చేరుకోగా 13.36 లక్షల క్యూసెక్కులు దిగువకు ప్రవహిస్తోంది. ధవ ళేశ్వరం వద్ద నీటిమట్టం 15 అడుగులకు పైగా పెరిగి 16 లక్షల క్యూసెక్కుల ప్రవాహం తరలిరావచ్చని అధికారులు అం చనా వేస్తున్నారు.
అప్రమత్తంగా అధికారులు
గత ఆరు రోజులుగా ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరికలు కొన సాగుతుండగా మంగళవారం రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించడంతో ఫ్లడ్‌ సెక్షన్‌ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 8 గంటల వ్యవధిలోనే మరలా రెండో ప్రమాద హెచ్చరిక జారీ కావడంతో ఈఈలు, డీఈ, ఏఈలు వారికి కేటాయించిన పరిధిలో వరద పర్యవేక్షణ అధికారులుగా విధుల్లో చేరారు. ఔట్‌ ఫాల్స్‌ స్లూయిజ్‌ల వద్ద తగు రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. వరదనీటి మట్టం మరింత పెరగవచ్చనే అంచనాతో మరింత అప్రమత్తంగా ఉన్నారు. ఎగువన భద్రాచలం వద్ద సోమవారం సాయంత్రానికి 46.30 అడుగుల వరకు తగ్గిన నీటిమట్టం ఆపై నిలకడగా కొనసాగి మంగళవారం తెల్లవారుజామున 48 అడుగులకు పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. వేగంగా పెరుగుతున్న నీటిమట్టం రాత్రి 7 గంటలకు 52.80 అడుగులకు చేరుకుంది. నీటిమట్టం 55 అడుగుల వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
  ఎగువ నీటి మట్టాలు ఇవే
కాళేశ్వరం వద్ద సోమవారం సాయంత్రానికి 9.900 మీటర్లుగా ఉన్న నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి ఒకటిన్నర మీటర్ల మేర పెరిగి 11.430 మీటర్లుకు చేరుకోగా, పేరూరు వద్ద 13.920 మీటర్లుగా ఉన్న నీటిమట్టం 15.370 మీటర్లుకు చేరుకుంది. దుమ్ముగూడెం వద్ద 14.720 మీటర్లు, భద్రాచలం వద్ద 52.80 అడుగులు, కూనవరం వద్ద 21.490 మీటర్లు, కుంట వద్ద 12.650 మీటర్లు, పోలవరం వద్ద 13.380 మీటర్లు, రాజమహేంద్రవరం వద్ద 16.840 మీటర్లుగా నీటిమట్టం నమోదైంది.

Updated Date - 2022-08-17T06:05:28+05:30 IST