Advertisement
Advertisement
Abn logo
Advertisement

గోదావరికి వరద ఉధృతి

రాజమండ్రి: గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఔట్ ఫ్లో  10,08,685 క్యూసెక్కులు ఉందని అధికారులు తెలిపారు. గోదావరి వరద ఉధృతి పెటెత్తడంతో అధికారులను ఎప్పటికప్పుడు విపత్తుల శాఖ అప్రమత్తం చేస్తున్నారు. వరద ఉధృతి సోమవారానికి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు హెచ్చరించారు. మరోవైపు విలీన మండలాల్లో గోదావరి, శబరి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. విలీన మండలాల్లో రహదారులపై  వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. 

Advertisement
Advertisement