వ్యాపారుల కోసం సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించిన GoDaddy

ABN , First Publish Date - 2022-07-06T01:25:13+05:30 IST

ప్రముఖ ఇంటర్నెట్ డొమైన్ సంస్థ గోడాడీ (GoDaddy) వ్యాపారుల కోసం సరికొత్త ప్రచారాన్ని

వ్యాపారుల కోసం సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించిన GoDaddy

న్యూఢిల్లీ: ప్రముఖ ఇంటర్నెట్ డొమైన్ సంస్థ గోడాడీ (GoDaddy) వ్యాపారుల కోసం సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. వ్యాపారం పరిమాణం, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ (Online) ద్వారా ఉనికిని చాటుకునేందుకు ఇది తోడ్పడుతుంది. అంతేకాకుండా మరింత మంది మహిళా వ్యాపారవేత్తలు ఆన్‌లైన్‌లోకి వెళ్లేందుకు, వారికి సాధికార కల్పించేందుకు ఈ ప్రచారం తోడ్పడుతుందని భావిస్తోంది. 


ఈ సరికొత్త ప్రచారంలో ఓ మహిళ జైపూర్‌ (Jaipur)లోని ఓ రద్దీ మార్కెట్‌లో అన్వేషిస్తుంది. చిరువ్యాపారుల విషయంలో కనిపిస్తున్న నిర్లక్ష స్థితిని చూసి నిరాశ చెందుతుంది. వారి వ్యాపారావకాశాలను వృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను వెల్లడిస్తూ ఓ వెబ్‌సైట్‌ (Website)ను సృష్టించి దానిపై వారికి అవగాహన పెంచుతుంది. ఆఫ్‌లైన్ ద్వారా కార్యకలాపాలు నిర్వహించడం వల్ల  లక్షలాది మందికి చేరువ కాకుండా మిగిలిపోతారని చెబుతుంది. ఈ ప్రచార కార్యక్రమం ద్వారా  వ్యాపార సంస్థలు ఆన్‌లైన్‌లో కార్యకలాపాలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూనే, గోడాడీ ఏకీకృత పరిష్కారం ఎలా తోడ్పడుతుందీ వివరిస్తారు.  


గోడావీ నూతన ప్రచారంపై ఆ సంస్థ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఎండీ నిఖిల్ అరోరా (Nikhil Arora) మాట్లాడుతూ.. గోడాడీ ద్వారా భారతదేశ వ్యాప్తంగా చిన్న, సూక్ష్మ, మధ్యతరహా వ్యాపార సంస్థలను ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలనుకుంటున్నట్టు చెప్పారు. వేగవంతమైన డిజిటలైజేషన్‌తో వ్యాపార యజమానులను నూతన మార్గాలను గురించి అన్వేషించాల్సిందిగా ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. ఆన్‌లైన్‌లో ఉనికిని చాటడం ద్వారా మరింతగా సాధించవచ్చన్నారు. మరింతగా దూసుకుపోయేలా మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. కాగా, తాజా ప్రచారాన్ని హిందీ , గుజరాతీ, కన్నడ, మలయళం, మరాఠీ, తమిళం, తెలుగు భాషలలో నిర్వహించనున్నారు. దీనిని టీవీ, ఎఫ్‌ఓఎస్‌, డిస్‌ప్లే, ఓఎల్‌వీ, సోషల్‌, పీఆర్‌ మీడియా మాధ్యమాల ద్వారా ప్రసారం చేస్తారు.


సమగ్రమైన ఆన్‌లైన్‌ ఉత్పత్తులను గోడాడీ అందిస్తుంది. వీటిలో డొమైన్‌ పేర్లు, హోస్టింగ్‌, వెబ్‌సైట్‌ బిల్డింగ్‌, ఈ–మెయిల్‌ మార్కెటింగ్‌, సెక్యూరిటీ ప్రొటెక్షన్స్‌, ఆన్‌లైన్‌ స్టోర్‌ వంటివి  ఉన్నాయి.  24 గంటల వినియోగదారుల సేవా మద్దతును స్థానిక, ప్రాంతీయ భాషలలో గోడాడీ అందిస్తోంది. 

Updated Date - 2022-07-06T01:25:13+05:30 IST