దేవా.. నీ భూములకు దిక్కేది?

ABN , First Publish Date - 2021-04-17T06:01:50+05:30 IST

దశాబ్దల కాలం నుంచి దేవాదాయ భూము లు ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. వేల ఎకరాలు అక్రమణకు గురయ్యా యి.

దేవా.. నీ భూములకు దిక్కేది?
చివ్వెంల మండలంలో ఆక్రమనకు గురైన భూమిలో బోర్డు ఏర్పాటు చేసిన దేవాలయ అధికారులు

(ఆంధ్రజ్యోతి, సూర్యాపేట)

దశాబ్దల కాలం నుంచి దేవాదాయ భూము లు ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. వేల ఎకరాలు అక్రమణకు గురయ్యా యి. కౌలుకు తీసుకున్న వారు కూడా చెల్లించడంలేదు. దేవాదాయ భూముల పక్కనే ఉన్న సర్వే నెం బర్‌ వేసి రిజిస్ర్టేషన్‌ చేయించుకొని రైతుబంధు పథ కం డబ్బులు తీసుకుంటున్నారు. ఆత్మకూర్‌(ఎస్‌) మం డలం కందగట్ల లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం కింద 654 ఎకరాల భూమి ఉంది. ముందుగా కౌలు కు చేశారు. ఆ తర్వాత కౌలు చెల్లించడం మానేశా రు. ఏకంగా పక్కా భూముల సర్వే నెంబర్‌ వేసి రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నారు. దేవాలయం మొత్తం శిథిలావస్థకు చేరాయి. పేకాటకు నిలయంగా మారింది. అక్కడ దే వాలయ భూములను పరిరక్షించే వారే కరువయ్యారు. అర్వపల్లి మండల కేంద్రంలోని యో గానంద లక్ష్మీనర్సింహస్వామి ఆలయం కింద 750 ఎకరాల భూమి ఉండగా 650 ఎకరాల భూమి        కౌలుకు తీసుకొని సేద్యం చేస్తున్నారు. ఏడాదికి రూ.500మాత్రమే చెల్లించి కౌలు చెల్లిస్తున్నారు. మరో 100ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. ఎం తో మంది ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. రిజిస్ర్టేషన్లు కూడా మారిపోయాయి. మోతె మండలం ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కిం ద 100కు పైగా ఎకరాలు ఉండేవి.  కౌలుకు తీసుకు న్న వారు ఏకంగా ఆక్రమించుకున్నారు. మద్దిరాల మండలం గోరెంట్ల వేంకటేశ్వరస్వామి, శివాలయాల కింద 150 ఎకరాల భూమి ఉంటే సుమారు 30ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. నాగారం మండలంలోని ఫణిగిరి లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం, శ్రీరామ ఆలయానికి సంబంధించిన భూములను కూడా పట్టాలు చేసుకున్నట్లు సమాచారం. చివ్వెంల మండలం దురాజ్‌పల్లి లింగమంతులస్వా మి గుడి కింద 26 ఎకరాల దేవాలయ భూమి ఉండగా 15 గుంటలు సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి అందజేశారు. అది పోనూ మిగిలిన భూమిలో ఐదు ఎకరాల దాకా అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది. చివ్వెంల మండలం   ఉండ్రుగొండ అటవీ భూమి 2వేల ఎకరాలకు పైగా ఉండగా 100ఎకరాల దాకా చుట్టు పక్కలా వారు ఆక్రమించుకున్నారు. పెన్‌పహాడ్‌ మండలం నాగులపహా డ్‌ త్రికుఠేశ్వర దేవాలయం కింద నాలుగు ఎకరాల భూమి ఉండాలి. ప్రస్తుతం ఎకర భూమి ఉండగా మిగతాది రైతులు పట్టా చేయించుకున్నారు. 


బూరుగడ్డలోనూ అన్యాక్రాంతం

హుజుర్‌నగర్‌ మండలం బూరుగడ్డ గ్రామంలోని వేణుగోపాలస్వామి దేవాలయం కింద 650 ఎకరాలు ఉంటే 350 మంది రైతులు సేద్యం చేస్తున్నారు. ఎకరానికి రైతులు రూ.3వేలు కౌలు చెల్లిస్తున్నారు. దీనిలో కూడా 100 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది. మోతె మండలంలోని ఉర్లుగొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కింద 80 ఎకరాల భూమి ఉండాలి. 15 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. ఎస్సారెస్పీ కాల్వల కింద 6 ఎకరాల భూమి పోగా, కౌలు తీసుకున్న రైతులు కూడా కౌలు డబ్బులు చెల్లించడం లేదని తెలుస్తోంది.


గతంలోనూ డ్రైవ్‌ నిర్వహించాం : మహేందర్‌కుమార్‌

గతంలోనూ దేవాదాయ శాఖ భూములపై సర్వే నిర్వహించామనిదేవాదాయ అసిస్టెంట్‌ కమిషనర్‌ మహేందర్‌కుమార్‌ అన్నారు. దేవాదాయ కమిషనర్‌కు  నివేదిక అందజేశామన్నారు. ట్రిబ్యునల్‌ కోర్టుకు అప్పీల్‌ చేస్తాం. పలువురు భూములను ఆక్రమించింది వాస్తవమేనన్నారు. దీనిపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2021-04-17T06:01:50+05:30 IST