Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 01 Jul 2022 20:29:31 IST

God Father ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది..

twitter-iconwatsapp-iconfb-icon

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్స్‌లో ఒకటి ‘గాడ్ ఫాదర్’ (God Father). తాజాగా ఈ సినిమా నుంచి మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్‌డేట్ వచ్చింది. మలయాళంలో మోహన్ లాల్ (Mohan Lal) హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ‘లూసీఫర్’ (Lucifer)ను తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఊటీ, ముంబై, హైదరాబాద్‌లలో ఈ సినిమా షూటింగ్ జరిపారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మెజారిటీ భాగం పూర్తైంది. తమిళ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా (Mohan Raja) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan), సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార (Nayanathara)లతో పాటుగా స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath), టాలెంటెడ్ హీరో సత్యదేవ్ (Sathyadev) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే, మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఈ నెల 4వ తేదీన సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను వదిలింది. ఇక ఇది మోషన్ పోస్టర్ అని తెలుస్తోంది.

మెగాస్టార్ గత చిత్రం ‘ఆచార్య’ తీవ్రంగా నిరాశపరచడంతో ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’ సినిమాతో భారీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు మెగాస్టార్. ఈ చిత్రాన్ని ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మెగాస్టార్ కెరీర్‌లో ‘గాడ్ ఫాదర్’ 153వ చిత్రం. ఇక 154వ చిత్రాన్ని దర్శకుడు బాబీతో చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇటీవలే ఆ చిత్రాన్ని 2023, సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఇందులో చిరు సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో వైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమాను పూర్తి చేస్తున్నారు చిరు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement