ఈ ప్రపంచం రహస్యాలతో నిండివుంది. కాలక్రమేణా చాలా రహస్యాల మర్మం వెలుగు చూసింది. అయితే ఇంకా అనేక రహస్యాల గుట్టు వీడలేదు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక విచిత్ర ఆలయం ఉంది. ఆలయంలో కొలువైన దేవుడు భక్తుల కోసం ఏడుస్తాడని చెబుతారు. ఇది వినడానికి ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ స్థానిక భక్తులు దీనిని నిజం అని నమ్ముతారు.
కాంగ్రాదేవి ఆలయంగా కూడా ప్రసిద్ధి చెందిన వ్రజేశ్వరి ఆలయంలో భైరవ్ బాబా విగ్రహం నుండి కన్నీరు కారుతుంటుంది. ఇక్కడివారి నమ్మకాల ప్రకారం భక్తులకు ఏదైనా బాధ లేదా ఇబ్బంది కలుగుతున్నదనడానికి సూచికగా ఆలయంలోని భైరవ బాబా విగ్రహం నుండి కన్నీరు కారుతుందట. దీనిని చూసిన స్థానికులు తమకు ఏవో ఇబ్బందులు రాబోతున్నాయని గ్రహంచి అప్రమత్తమవుతారట.