మొజరెల్లా గోబీ కోఫ్తా

ABN , First Publish Date - 2021-01-03T17:47:51+05:30 IST

క్యాలీఫ్లవర్‌ - ఒక కప్పు, సెనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, పెరుగు - రెండు టేబుల్‌స్పూన్లు, మొజరెల్లా ఛీజ్‌ - పావు కప్పు, గరంమసాలా - ఒక టీస్పూన్‌, ఉప్పు - చిటికెడు, గ్రేప్‌ సీడ్‌ ఆయిల్‌ - రెండు టేబుల్‌స్పూన్లు.

మొజరెల్లా గోబీ కోఫ్తా

కావలసినవి:


కోఫ్తా కోసం: క్యాలీఫ్లవర్‌ - ఒక కప్పు, సెనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, పెరుగు - రెండు టేబుల్‌స్పూన్లు, మొజరెల్లా ఛీజ్‌ - పావు కప్పు, గరంమసాలా - ఒక టీస్పూన్‌, ఉప్పు - చిటికెడు, గ్రేప్‌ సీడ్‌ ఆయిల్‌ - రెండు టేబుల్‌స్పూన్లు.


రైతా కోసం : చిలగడదుంప - ఒకటి, ఉల్లిపాయ - ఒకటి, ఉల్లికాడలు - నాలుగైదు, క్రీమ్‌ - ఒక కప్పు, పాలు - అరకప్పు, ఉప్పు-చిటికెడు, గరంమసాలా - ఒక టీస్పూన్‌. 


తయారీ విధానం: క్యాలీఫ్లవర్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఉల్లిపాయ, ఉల్లికాడలను సన్నగా తరగాలి. చిలగండదుంపను కట్‌ చేసి పెట్టుకోవాలి. ఒక మీడియం సైజు పాత్రలో క్యాలీఫ్లవర్‌ ముక్కలు తీసుకుని అందులో ఛీజ్‌, సెనగపిండి, పెరుగు, గరంమసాలా, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోయాలి. నూనె వేడి అయ్యాక క్యాలీఫ్లవర్‌ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ బాల్స్‌ చేసుకుని నూనెలో వేగించాలి. ముదురు గోధుమ రంగులోకి మారే వరకు వేగించుకోవాలి. ఒక పాత్రలో చిలగడదుంపలు వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత నీళ్లన్నీ తీసేసి మరొక పాత్రలోకి చిలగడదుంపలు తీసుకోవాలి. వాటిలో ఉల్లిపాయలు, ఉల్లికాడలు, గరంమసాలా, తగినంత ఉప్పు వేసి కలపాలి. క్రీమ్‌, పాలు పోసి కలిపితే రైతా రెడీ. గోబీ కోఫ్తాలను ఈ రైతాతో తింటే రుచిగా ఉంటాయి.


Updated Date - 2021-01-03T17:47:51+05:30 IST