పోలీస్ స్టేషన్‌లో అతిథులుగా మేకలు.. యజమాని కోసం పోలీసుల పడిగాపులు..!

ABN , First Publish Date - 2020-09-25T20:24:18+05:30 IST

తప్పిపోయి తిరుగుతూ పోలీసులకు దొరికిన మేకలు ఇప్పుడు పోలీస్‌స్టేషన్‌లోనే ..

పోలీస్ స్టేషన్‌లో అతిథులుగా మేకలు.. యజమాని కోసం పోలీసుల పడిగాపులు..!

బర్థమాన్ (పశ్చిమబెంగాల్): తప్పిపోయి తిరుగుతూ పోలీసులకు దొరికిన మేకలు ఇప్పుడు ‌స్టేషన్‌లోనే అతిథి మర్యాదలు అందుకుంటున్న చిత్రమిది.. పశ్చిమ బెంగాల్లోని పూర్బ బర్థమాన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వారం రోజుల క్రితం భతార్ స్టేషన్ పరిధిలో పోలీసులు నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. వారికి రోడ్డుపై నాలుగు మేకలు కనిపించాయి. అందులో ఒకటి చూడి మేక ఉండడం, వాటి యజమాని దరిదాపుల్లో కనిపించకపోవడంతో పోలీసులు మేకలను బతార్ పోలీస్ స్టేషన్‌‌కు తీసుకొచ్చారు. ‘‘యజమాని కోసం ఎంత గాలించినా అతడు కనిపించకపోవడంతో వాటిని పోలీస్ స్టేషన్‌కి తీసుకురావాలని భావించాం. ఈ ప్రాంతంలో మేకలకు దొంగల ముప్పు కూడా ఉంది. అందుకే వాటికి ఆహారం అందించి, సంరక్షిస్తున్నాం. ప్రస్తుతం మేకల యజమాని కోసం గాలిస్తున్నాం. యజమాని వచ్చి తగిన ఆధారాలు సమర్పిస్తే వాటిని అతడికి అప్పగిస్తాం...’’ అని ఓ అధికారి వెల్లడించారు. ఓ మేక ఇప్పటికే రెండు పిల్లలకు జన్మనివ్వడంతో.. వాటిని చూసుకునేందుకు పోలీసులు ఓ స్వచ్ఛంద సేవకుడిని కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడూ నేరగాళ్ల కోసం గాలించే పోలీసులు.. మేకల యజమాని ఎప్పుడొచ్చి వాటిని తీసుకెళ్తాడా అని పడిగాపులు కాస్తుండడంపై స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. 

Updated Date - 2020-09-25T20:24:18+05:30 IST