గోఎయిర్‌ రూ.3,600 కోట్ల ఐపీఓ

ABN , First Publish Date - 2021-05-15T05:56:33+05:30 IST

గో ఫస్ట్‌గా పేరు మార్చుకున్న గో ఎయిర్‌ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు రాబోతోంది. క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి ‘సెబీ’కి ప్రాథమిక పత్రాలు కూడా సమర్పించింది

గోఎయిర్‌ రూ.3,600 కోట్ల ఐపీఓ

న్యూఢిల్లీ: గో ఫస్ట్‌గా పేరు మార్చుకున్న గో ఎయిర్‌ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు రాబోతోంది. క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి ‘సెబీ’కి ప్రాథమిక పత్రాలు కూడా సమర్పించింది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.3,600 కోట్లు సేకరించాలని ఈ ఎయిర్‌లైన్స్‌ లక్ష్యంగా పెట్టుకుంది.  ప్రధానంగా రుణ బకాయిలను తీర్చేందుకు నిధులను ఉపయోగించాలని భావిస్తోంది. వాడియా గ్రూప్‌నకు చెందిన ఈ ఎయిర్‌లైన్స్‌.. 15 ఏళ్ల క్రితం కార్యకలాపాలు ప్రారంభించింది. ఐపీఓ ద్వారా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో లిస్ట్‌ కానున్న నాలుగో ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌ ఇది. జెట్‌ఎయిర్‌వేస్‌, ఇండిగో, స్పైస్‌జెట్‌ ఇప్పటికే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో లిస్టయ్యాయి. ఆర్థికంగా దివాలా తీసిన జెట్‌ ఎయిర్‌వేస్‌ మాత్రం 2019 ఏప్రిల్‌లో మూతపడింది.

Updated Date - 2021-05-15T05:56:33+05:30 IST