సీతామాతపై అనుచిత వ్యాఖ్య.. ఉద్యోగం పోగొట్టుకున్న గోఎయిర్ పైలట్!

ABN , First Publish Date - 2020-06-05T03:14:23+05:30 IST

ట్విటర్‌లో సీతామాతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోఎయిర్ పైలట్ ఉద్యోగం పోగొట్టుకున్నాడు.

సీతామాతపై అనుచిత వ్యాఖ్య.. ఉద్యోగం పోగొట్టుకున్న గోఎయిర్ పైలట్!

ముంబై: ట్విటర్‌లో సీతామాతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోఎయిర్ పైలట్ ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అతడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు సదరు పైలట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోఎయిర్‌పై కూడా నలువైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. బాయ్‌కాట్ గోఎయిర్ హ్యష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అయింది. దీంతో సంస్థ యాజమాన్యం వెంటనే రంగంలోకి దిగింది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా సదరు ట్రైనీ పైలట్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. అతడి కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తూ తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నామని ప్రకటించింది. ఉద్యోగుల వ్యక్తిగత అభిప్రాయాలతో సంస్థకు ఎటువంటి సంబంధం ఉండదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేసింది. 

Updated Date - 2020-06-05T03:14:23+05:30 IST