Goa: నేటి నుంచి ఇళ్లకు ఉచితంగా మంచినీరు

ABN , First Publish Date - 2021-09-01T13:46:01+05:30 IST

గోవా రాష్ట్ర ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ శుభవార్త వెల్లడించారు...

Goa: నేటి నుంచి ఇళ్లకు ఉచితంగా మంచినీరు

పనాజీ (గోవా): గోవా రాష్ట్ర ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ శుభవార్త వెల్లడించారు. గోవాలోని ఇళ్లకు నెలకు 16వేల లీటర్ల మంచినీటిని బుధవారం నుంచి ఉచితంగా సరఫరా చేస్తామని సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు. ప్రతీ ఇంటికి నెలకు 16వేల లీటర్ల నీటిని ఉచితంగా అందించే కార్యక్రమాన్ని సీఎం ప్రమోద్ ప్రారంభించారు. దేశంలో ఢిల్లీ, తెలంగాణ తర్వాత గోవా రాష్ట్రంలో ఉచితంగా మంచినీటిని సరఫరా చేస్తోంది. మంచినీటిని పొదుపుగా వాడుకుంటూ ఉచిత నీటి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం ప్రమోద్ సావంత్ కోరారు. 



గోవాలోని 60 శాతం ఇళ్లకు జీరో బిల్లులు వస్తాయని, ఫ్లాట్లు, కాంప్లెక్సుల్లో నివశించే ప్రజలు ఉచితనీటి పథకాన్ని వినియోగించుకోవాలని సీఎం సూచించారు.చిన్న వ్యాపారులు, రెస్టారెంట్లకు కూడా ఈ ఉచిత నీటి పథకాన్ని అమలు చేస్తామని సీఎం చెప్పారు. వాణిజ్య వినియోగదారులు పెండింగు బిల్లుల చెల్లింపునకు ఒన్ టైమ్ సెటిల్ మెంట్ పథకాన్ని అమలు చేస్తామని సీఎం ప్రమోద్ వివరించారు.

Updated Date - 2021-09-01T13:46:01+05:30 IST