టీఎంసీలో చేరిన కాంగ్రెస్ మాజీ సీఎం

ABN , First Publish Date - 2021-09-30T00:04:22+05:30 IST

గోవాకు నమ్మకమైన ప్రత్యామ్నాయం కావాలి. ఆ నమ్మకమైన ప్రత్యామ్నాయం మమతా బెనర్జీలో కనిపించాయి. అందుకే నా ప్రయానాన్ని దీదీతో ప్రారంభించాను. గోవాకు ఒక ప్రత్యేకమైన సంస్కృతి, భిన్నత్వం ఉంది. అది ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉంది. నేను మమతా బెనర్జీనికి గోవాకు రావాలని విజ్ణప్తి చేస్తున్నాను..

టీఎంసీలో చేరిన కాంగ్రెస్ మాజీ సీఎం

కోల్‌కతా: గోవా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత లూజినో ఫలీరో.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం కోల్‌కతాలోని టీఎంసీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కీలక నేత ఆకాష్ బెనర్జీ సమక్షంతో పది మందితో కలిసి టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, ప్రస్తుతం ఎమ్మెల్యే పదవిలో ఈయన టీఎంసీ కండువా కప్పుకున్న అనంతరం మాట్లాడుతూ గోవాకు మమతా బెనర్జీ నాయకత్వం అవసరం ఉందని, అందుకే తాను టీఎంసీలో చేరినట్లు లూజినో ఫలీరో చెప్పుకొచ్చారు.


‘‘గోవాకు నమ్మకమైన ప్రత్యామ్నాయం కావాలి. ఆ నమ్మకమైన ప్రత్యామ్నాయం మమతా బెనర్జీలో కనిపించాయి. అందుకే నా ప్రయానాన్ని దీదీతో ప్రారంభించాను. గోవాకు ఒక ప్రత్యేకమైన సంస్కృతి, భిన్నత్వం ఉంది. అది ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉంది. నేను మమతా బెనర్జీనికి గోవాకు రావాలని విజ్ణప్తి చేస్తున్నాను. గోవా సంస్కృతి, భిన్నత్వం, వారసత్వ సంపదను కాపాడాల్సిందిగా కోరుతున్నాను’’ అని లూజినో ఫలీరో అన్నారు.

Updated Date - 2021-09-30T00:04:22+05:30 IST