Abn logo
Oct 19 2020 @ 01:03AM

పల్లె పడుచు!

Kaakateeya

పల్లె పడుచుగా మారిన కథానాయిక రాశీ ఖన్నాను చూశారా? ఇదిగో... ఇలా! ఈ ఫొటోలు ఆదివారం సామాజిక మాధ్యమాల్లో సందడి చేశాయి. రాశీ ఖన్నా తెరపై ఎక్కువగా నవతరం అమ్మాయి తరహా పాత్రలు పోషించారు. అయితే, డిజైనర్‌ శ్రవణ్‌   కొత్త కలెక్షన్‌ కోసం ఆమె పల్లె పడుచుగా మారారు. ప్రత్యేకంగా ఫొటోషూట్‌ చేయించుకుని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. దీని గురించి ‘చిత్రజ్యోతి’తో రాశీ ఖన్నా మాట్లాడుతూ ‘‘శ్రవణ్‌ కొత్త కలెక్షన్‌ కోసం ఈ ఫొటోషూట్‌ చేశా. అతనెప్పుడూ నేను ఓ పల్లెటూరి పడుచులా దుస్తులు ధరిస్తే బావుంటుందని చెప్తూ ఉంటారు. నాలోనూ మరో కోణం చూపిస్తే బావుంటుందని మొత్తానికి ఇలా ముస్తాబు అయ్యాను. ఈ లుక్‌ నాకు విపరీతంగా నచ్చేసింది. నాతో నేను ప్రేమలో పడ్డాను. నాలో ఈ కోణాన్ని నేను చూడలేదు. కానీ, శ్రవణ్‌ చూశాడు. ఇది సినిమా కోసం కాదు’’ అని చెప్పారు. 


Advertisement
Advertisement
Advertisement