Abn logo
Oct 24 2020 @ 01:03AM

జైలుకైనా వెళ్తా కానీ....

Kaakateeya

కంగనా రనౌత్‌ తెరమీద రెబల్‌ పాత్రలు పోషించడమే కాదు నిజజీవితంలోనూ అంతే ధైర్యంగా కనిపిస్తారు. అవతలి వ్యక్తులు ఎంత గొప్పవాళ్లయినా, వ్యవస్థలు ఎంత శక్తిమంతమైనవి అయినా ఆమె లెక్కచేయరు. తాజాగా ఆమె మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వంపై ట్విట్టర్‌లో మాటల దాడి చేశారు. మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ కంగన, ఆమె చెల్లెలు రంగోలీ చందేల్‌పై మహారాష్ట్రలో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో స్పందించిన కంగన ‘‘రాణీ లక్ష్మీబాయి కోటను కూల్చినట్టే నా ఇంటిని కూల్చారు. తిరుగుబాటు చేసినందుకు సావర్కర్‌ లా నన్ను కూడా జైల్లో పెట్టాలనుకుంటున్నారు. కానీ నేను దేనికీ తలవంచను. పాపం ఈ అసహనపు దేశంలో ఎన్ని కష్టాలు పడ్డారో దయచేసి ఇంటోలరెన్స్‌ గ్యాంగ్‌ను అడగండి’’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ విషయంపై మౌనంగా ఉన్న ఆమిర్‌ఖాన్‌ ను కంగన టార్గెట్‌ చేశారు. తన ట్వీట్‌ను ఆమిర్‌ఖాన్‌కు ట్యాగ్‌ చేశారు. ‘దేశంలో అసహనం పెరిగిపోతోంది. నా భార్య దేశం వదలివెళ్లిపోదామంటోంది’’ అంటూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఆమిర్‌ఖాన్‌ను పరోక్షంగా ఎత్తిపొడుస్తూ ఆమె ఈ ట్వీట్‌ చేశారు. ‘‘క్యాండిల్‌ మార్చ్‌ గ్యాంగ్‌, అవార్డు వాపసీ గ్యాంగ్‌... చూడండి, నేను మీలా కాదు, మహారాష్ట్రలో పాలన సాగిస్తున్న ఫాసిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. అందులోనే నా జీవితానికి అర్థం ఉంది. నేను మీ అందరిలా మోసగత్తెను కాను’’ అని ట్వీట్‌ చేశారు.


Advertisement
Advertisement